బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. సోషల్ మీడియాలో చాలా టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి కానీ మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిగో టైటిల్ ప్రకటన , అదిగో ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నట్టుగా ఫ్యాన్స్ కి టైటిల్ చెప్పకుండా ఊరిస్తున్నారు.
బాలయ్య సినిమా టైటిల్ అంటే పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. టైటిల్ తోనే సగం బజ్ క్రియేట్ చేస్తుంటాడు బాలయ్య. అందుకే మేకర్స్ ఇంకా డైలమాలోనే ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు పెద్దాయన , రెడ్డి గారు , అన్నగారు ఇలా చాలానే టైటిల్స్ వినిపించాయి. ఫైనల్ గా ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ ఉంది.
ఇటివలే జై బాలయ్య అంటూ ఓ సాంగ్ కూడా విజువల్ గా లీకైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఇదే టైటిల్ అని ఫిక్సయిపోయారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. బాలయ్య నటిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ సినిమాకు జై బాలయ్య అనే స్లోగన్ ని టైటిల్ గా ఫిక్స్ చేయడం ఎంత కరెక్ట్ ? అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటున్నారట.
షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకున్నప్పటికీ ఇంకా వర్కింగ్ టైటిల్ తోనే సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు మేకర్స్. మరి ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసేదెప్పుడో అసలు ఏ టైటిల్ సెలెక్ట్ చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ని ఇంకా ఊరించకుండా త్వరలోనే మేకర్స్ టైటిల్ చెప్పేస్తే బెటర్. లేదంటే మరి కొన్ని టైటిల్స్ కూడా లిస్టులో చేరి చక్కర్లు కొడుతుంటాయి.
This post was last modified on September 6, 2022 9:03 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…