జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మెగా కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఈ ఏడాది జులై 30న రావాల్సిన ఆ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. అనివార్య పరిస్థితుల్లోనే సినిమాను వెనక్కి జరిపిన రాజమౌళి బృందం ఆ డేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని పక్కా ప్లానింగ్‌తో పని చేస్తూ వచ్చింది.
కానీ కరోనా మహమ్మారి వచ్చి వాళ్ల ప్రణాళికల్ని దెబ్బ తీసింది. ఇప్పటికే నెల రోజులుగా చిత్ర బృందం షూటింగ్ చేయట్లేదు. లాక్ డౌన్ ఎప్పటికి ఎత్తేస్తారో.. షూటింగులకు ఎప్పుడు అనుమతులు వస్తాయో తెలియట్లేదు. లాక్ డౌన్ మొదలైన ఆరంభంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారదని కచ్చితంగా చెప్పిన చిత్ర బృందం.. ఇప్పుడు అంత నమ్మకంతో ఉన్నట్లు కనిపించడం లేదు.
స్వయంగా రాజమౌళే 2021 జనవరి 8న ఆర్ఆర్ఆర్ వస్తుందని ధీమాగా చెప్పలేకపోతున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి అడిగితే.. జక్కన్న సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు. తమ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణ విషయంలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయన్నాడు.
ప్రభుత్వం ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తుంది.. షూటింగులకు అనుమతి ఇచ్చినా ఎంతమంది చిత్రీకరణలో పాల్గొనాలనే విషయంలో ఎలాంటి షరతులు విధిస్తుంది.. మిగతా దేశాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి.. విమాన ప్రయాణాల సంగతేంటి అనే విషయాలు తేలాల్సి ఉందని రాజమౌళి తెలిపాడు.
దీన్ని బట్టే తమ ప్లానింగ్ ఆధారపడి ఉంటుందని.. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదని.. అన్ని విషయాలపై స్పష్టత వచ్చాకే ఏమైనా చెప్పగలమని రాజమౌళి అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆర్ఆర్ఆర్ విడుదల ఎప్పుడనేది ఇప్పుడు రాజమౌళి సహా ఎవ్వరూ చెప్పలేరన్నట్లే.
This post was last modified on April 22, 2020 1:42 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…