ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ రాజమౌళి రేంజ్ లో లేవు కానీ ట్రెండ్ చూస్తుంటే సెప్టెంబర్ 9నాటికి మంచి ఫిగర్స్ నమోదయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ముంబై ట్రేడ్ ఇస్తున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా 40 శాతం ఆక్యుపెన్సీతో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట. రిలీజ్ రోజు నేరుగా జరిగే కౌంటర్ బుకింగ్ లో ఎక్కువ అమ్మకాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ట్రైలర్ కంటే బెటర్ గా మొన్న వచ్చిన కొత్త ప్రోమోతోనే హైప్ పెరిగిందని చెప్పాలి. జక్కన్న దీని ప్రమోషన్ల విషయంలో టీమ్ కు అండగా నిలుస్తున్నారు.
సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర అంత రెవిన్యూ రాబడుతుందానేది ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతోంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే ఏ ఇబ్బంది లేదు. ఈజీగా వచ్చేస్తాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు వెయ్యి కోట్లకు పైగా రాబట్టగా లేనిది అందులో సగం కూడా టార్గెట్ పెట్టుకోని బ్రహ్మాస్త్ర భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. అసలే నార్త్ ఆడియన్స్ ఈ మధ్య చాలా నిర్దయగా ఉంటున్నారు. స్టార్లు అయినా సరే కంటెంట్ వీక్ ఉంటే మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మొత్తం చిన్న విషయం కాదు. రన్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని కూడా టెన్షన్ పడక తప్పడం లేదు. తెలుగు మీద ఎంత ఫోకస్ పెట్టారంటే ఎన్నడూ లేనిది ఓ బాలీవుడ్ మూవీ టీమ్ బిగ్ బాస్ 6, యాంకర్ సుమ క్యాష్ లాంటి ప్రోగ్రాంస్ లో పాల్గొనేందుకు సైతం వెనుకాడలేదు. అలియా గర్భవతిగా ఉన్నా సరే రిస్క్ గురించి ఆలోచించకుండా విమానాల్లో తిరిగేస్తోంది. భర్తతో స్టేజి మీద తెలుగులో మాట్లాడించింది. లాల్ సింగ్ చడ్డా టైంలో అమీర్ ఖాన్ ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడపడం గుర్తేగా. కానీ ఆ ఫలితం రాకుంటే చాలు అదే పదివేలు.
This post was last modified on September 4, 2022 8:30 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…