Sonakshi Sinha
సుశాంత్ రాజ్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వారసత్వ బృందంలో సోనాక్షి సిన్హా ఒకరు. పెద్దగా టాలెంట్ లేకపోయినా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారంటూ టార్గెట్ చేసిన వాళ్లలో సోనాక్షి కూడా ఉంది. ఈ ట్రోల్స్ అవీ తట్టుకోలేక ఆమె ట్విట్టర్ విడిచి వెళ్లిపోయింది కొన్ని రోజుల కిందట. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మళ్లీ ఆదివారం ఆమె పేరు ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అయింది. ఇందుక్కారణం.. ఇండస్ట్రీలో తాను అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పడమే.
సోనాక్షి ఒకప్పుడు ఏకంగా 95 కిలోలుండేది. అప్పటి ఫొటోలు కూడా కొన్ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఐతే హీరోయిన్ కావడం కోసం తాను 30 కిలోల దాకా బరువు తగ్గానని.. అప్పటికి కానీ దబంగ్ సినిమాలో కనిపించిన అవతారంలోకి మారలేదని చెప్పిన సోనాక్షి.. అంత కష్టపడ్డా కూడా ఇండస్ట్రీలో అవమానాలు తప్పలేదని అంది.
‘‘స్కూల్లో చదివేటపుడు నేను 95 కిలోలు ఉండేదాన్ని. అప్పుడందరూ నా బరువు చూసి ఎగతాళి చేసేవాళ్లు. కానీ అవేవీ నేను పట్టించుకోలేదు. నన్ను నేను తక్కువ చేసుకోలేదు. దబంగ్ సినిమా కోసం బరువు తగ్గడం నేను సాధించిన ఓ ఘనతగా భావిస్తా. ఆ విషయంలో గర్వపడతా. కానీ 30 కిలోల బరువు తగ్గాక కూడా జనాలు నా వెయిట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. బరువు విషయంలో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాను’’అని సోనాక్షి చెప్పుకొచ్చింది.
ఐతే పెద్దగా కష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చేసిన నీలాంటి స్టార్ కిడ్సే ఇలా మాట్లాడితే.. సుశాంత్ లాంటి వాళ్లు ఎంత శ్రమించి ఉంటారంటూ మరోసారి సోనాక్షిని టార్గెట్ చేశారు నెటిజన్లు. అందుకే ఆమె పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది.
This post was last modified on July 6, 2020 4:50 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…