ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీలో కొంత వరకే పనికొస్తుంది. ఆపై నెగ్గుకురావాలంటే టాలెంట్ తో పాటు సక్సెస్ ఉంటేనే మనుగడ సాధ్యం. ఇది అందరికి తెలిసిన సత్యమే. అందుకే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, కథల ఎంపికలో నిర్లక్ష్యం వహించినా దానికి సదరు హీరోలే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అభిమానుల సానుభూతి కూడా దక్కదు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కు ఇది మెల్లగా అవగతమవుతోంది.
ఒకే సినిమాతో ఉప్పెన తెచ్చిన ఇమేజ్ ఎక్కువ కాలం తనను గార్డ్ చేయలేదని ఒక్కో ఫ్లాపు తగిలేకొద్దీ కుర్రాడికి క్లారిటీ వస్తోంది. రంగ రంగ వైభవంగా చాలా వీక్ ఓపెనింగ్ తెచ్చుకుంది. అతి కష్టం మీద మొదటి రోజు షేర్ కేవలం 1 కోటి 5 లక్షలు రావడమంటే ఈ సినిమా మీద ప్రేక్షకులకు కనీస ఆసక్తి లేదనే విషయం తేటతెల్లం చేస్తోంది. ఆదివారం వసూళ్లు దీనికంటే కార్తికేయ 2, సీతారామంలకే బాగున్నాయి.
ఎలాగూ పబ్లిక్ టాక్ రివ్యూలు నెగటివ్ గా వచ్చేశాయి కాబట్టి ఇక ఏదో అద్భుతం జరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టం. థియేట్రికల్ బిజినెస్ సుమారు ఎనిమిదిన్నర కోట్ల దాకా చేశారు. హిట్ అయితే ఇది చాలా చిన్న మొత్తం. కానీ ఫలితం రివర్స్ అయ్యింది. హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. బిసి సెంటర్స్ లో డ్రాప్ తీవ్రంగా ఉంది. వైష్ణవ్ ఇకపై మరింత జాగరూకతతో ఉండాలి. అసలే నటన మీద కామెంట్స్ ఎక్కువవుతున్నాయి.
ఒకప్పుడు తరుణ్, వరుణ్ సందేశ్, ఉదయ్ కిరణ్ లాంటోళ్ళు కెరీర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు చూశారు. కానీ తర్వాత వరస పరాజయాలు ఏకంగా ఇండస్ట్రీకి దూరం చేశాయి. అక్కినేని హీరోల మద్దతు ఉన్నా సుమంత్ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. నందమూరి ఫ్యామిలీలో తారకరత్న ఏమయ్యాడో చూశాం. సో వైష్ణవ్ తేజ్ ఇప్పుడీ రెండో వైఫల్యం గురించి సీరియస్ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పెదమావయ్య చిరంజీవి పేరుని తెరమీద వాడకుండా స్క్రిప్ట్ ల విషయంలో ఆయన సలహాలు నిర్ణయాలు తీసుకోవడంలో వాడుకుంటే బెటర్.
This post was last modified on September 4, 2022 6:28 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…