సినీ పరిశ్రమలో జాతకం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. ఆ రోజు మార్నింగ్ షోకు పాజిటివ్ టాక్ వచ్చి, సినిమా హిట్ అనిపిస్తే చాలు.. టీంలోని వాళ్లందరికీ డిమాండ్ పెరిగిపోతుంది. ఇక దర్శకుడి సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఫోన్ ఆగకుండా మోగుతుంటుంది. మెసేజ్‌ల వర్షం కురుస్తుంది. కానీ సినిమా తేడా కొడితే అదే ఫోన్ మూగబోతుంది. ఎవ్వరూ పట్టించుకోరు. ఏ రంగంలో అయినా సక్సెస్ చుట్టూనే అందరూ తిరుగుతారన్నది వాస్తవం. కానీ సినీ రంగంలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ కాబట్టి ఇక్కడ విజయానికి దక్కే విలువ కూడా ఎక్కువే.
అలాగే ఇక్కడ ఒక్క పరాజయంతో జీవితం తల్లకిందులవుతుంది కూడా. పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది. ఆయనకు ఫ్లాపులు కొత్తేమీ కాదు. ‘టెంపర్’ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆయన వరుసబెట్టి డిజాస్టర్లు తీశాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆయనకు ‘ఇస్మార్ట్ శంకర్’ అత్యావశ్యక విజయాన్ని అందించింది. ఈ సక్సెస్ చూసి పూరి కంటే ఆయన అభిమానులు ఎంతో సంతోషించారు.
పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడని.. ఈ ఉత్సాహంలో చెలరేగిపోతాడని అనుకున్నారు. ఈసారి ఆయనకు విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో దొరికాడు. ‘లైగర్’ రూపంలో పాన్ ఇండియా సినిమా సెట్ అయింది. విడుదల ముంగిట ఈ చిత్రానికి మంచి హైప్ కూడా వచ్చింది. కానీ ఏం లాభం? తన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటనదగ్గ చిత్రంతో పూరి పూర్తిగా నిరాశ పరిచాడు. దెబ్బకు ఆల్రెడీ అనౌన్స్ అయిన ‘జనగనమణ’కు బ్రేక్ పడిపోయింది. ముందు నుంచి ఈ సినిమా ముందుకు కదులుతుందా లేదా అన్న డౌట్లున్నాయి. ‘లైగర్’కు హైప్ తేవడం కోసమే దీన్ని హడావుడిగా అనౌన్స్ చేశారేమో అన్న సందేహాలు కలిగాయి.
ఇప్పుడు వాటినే నిజం చేస్తూ ‘లైగర్’ డిజాస్టర్ కాగానే దాన్ని పక్కన పెట్టేశారు. అంత హైప్ వచ్చిన ‘లైగర్’యే అంత పెద్ద డిజాస్టర్ అయ్యాక ‘జనగణమన’కు బజ్ క్రియేట్ చేయడం, బిజినెస్ చేయడం చాలా చాలా కష్టం. విజయ్ ఇలాంటి చేదు అనుభవం తర్వాత పూరీతో జట్టు కట్టే సాహసం చేయలేడు. కాబట్టి ‘జనగణమన’ అటకెక్కేసింది. మరి ఈ స్థితిలో పూరి ఏం చేస్తాడు..? ఇలాంటి స్థితిలో ఆయన్ని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాత ఎవరు..? ఆయన కథకు పచ్చ జెండా ఊపే హీరో ఎవరు..? అన్నది ప్రశ్నార్థకమే. ఈ స్థితి నుంచి ఆయన పుంజుకోవాలంటే అద్భుతాలే జరగాలి.
This post was last modified on September 4, 2022 3:38 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…