టాలీవుడ్ లో చాలానే సెంటిమెంట్స్ ఉంటాయి. పైకి చెప్పుకోరు కానీ అందరూ గుడ్. బ్యాడ్ సెంటిమెంట్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటారు. అయితే ఇలాంటి ఓ బ్యాడ్ సెంటిమెంటే మెగాస్టార్ మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరు సపోర్ట్ చేసిన ప్రతీ సినిమా ఫట్టు అంటూ యాంటీ ఫ్యాన్స్ చిరు ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ వారిని రెచ్చగొడుతున్నారు.
ఇండస్ట్రీలో కూడా చిరు బ్యాడ్ సెంటిమెంట్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని భోగట్టా. ఇటివలే మెగా స్టార్ గెస్ట్ గా వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అపజయం అందుకుంటుండంతో ఈ సెంటిమెంట్ యాంటీ ఫ్యాన్స్ కి బలం చేకూరుస్తుంది. చిరు ఈ మధ్య గెస్ట్ గా వచ్చి సపోర్ట్ చేసిన సినిమాలు శ్రీకారం, పక్కా కమర్షియల్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అలాగే చిరు సమర్పణలో రిలీజ్ అయిన ‘లాల్ సింగ్ చడ్డా’ రిజల్ట్ కూడా తేడా కొట్టడంతో రీసెంట్ గా చిరు ని టార్గెట్ చేస్తూ మిగతా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా మెగా స్టార్ మెగా గెస్ట్ గా వచ్చిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కూడా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు మరోసారి మెగా బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అంటూ కొందరు పోస్టులు పెడుతూ మెగా కాంపౌండ్ ని టార్గెట్ చేస్తున్నారు.
నిజానికి చిరుకి ఓ రకంగా ఇది బ్యాడ్ టైమే.. అయన నటించిన ఆచార్య కూడా ఘోరమైన రిజల్ట్ అందుకొని ట్రోలింగ్ కి గురైంది. దాన్ని అలుసుగా తీసుకొని కొందరు మెగా యాంటీ ఫ్యాన్స్ మెగా స్టార్ పై బ్యాడ్ సెంటి మెంట్ అనే ముద్ర వేసేస్తున్నారు. ఇక చిరు గెస్ట్ గా వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్స్ సాధించాయి. మెగా స్టార్ ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టే ముందు చిరు రాకతో బజ్ క్రియేట్ చేసుకొని సూపర్ హిట్లు కొట్టిన సినిమాల లిస్టు కూడా తెలుసుకుంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
This post was last modified on September 4, 2022 6:54 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…