కేతిక శర్మ.. గత ఏడాది టాలీవుడ్లోకి కొత్తగా అడుగు పెట్టిన ముంబయి భామ. తొలి సినిమా ‘రొమాంటిక్’తో యూత్‌కు ఈ అమ్మాయి పిచ్చెక్కించేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు యూత్‌లో బజ్ క్రియేట్ అయిందంటే అందుకు కేతికనే కారణం. తొలి రోజు ఓపెనింగ్స్ రావడంలో కూడా ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ప్రోమోల్లో ఆ రేంజిలో అందచందాలతో ఆకట్టుకుంది కేతిక. సినిమా ఎంత పేలవంగా ఉన్నప్పటికీ.. హీరోయిన్ గురించి మాత్రం అందరూ పాజిటివ్‌గానే మాట్లాడుకున్నారు.
సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇది చూసే తొలి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేతికకు అవకాశాలు వచ్చాయి. ఆమె రెండో సినిమా.. లక్ష్య. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. పేలవమైన కథాకథనాలు సినిమాను నీరుగార్చేశాయి. అందులో కేతిక కూడా పెద్దగా హైలైట్ కాలేదు.
అయినా ‘రంగ రంగ వైభవంగా’ లాంటి క్రేజున్న సినిమాలో కేతికకు అవకాశం దక్కింది. ఇందులో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ హీరో కావడం, పాటలు సూపర్ హిట్టవడం, ప్రోమోల్లో రొమాన్స్.. ఎంటర్టైనర్మెంట్ హైలైట్ కావడంతో సినిమాకు డీసెంట్ బజ్ వచ్చింది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్లలో హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. సినిమా బాగుంటే మంచి పేరొస్తుంది. కెరీర్ కూడా మరో స్థాయికి వెళ్తుంది. దీంతో ఈ చిత్రంపై కేతిక చాలా ఆశలే పెట్టుకుంది. కానీ శుక్రవారం రిలీజైన ‘రంగ రంగ వైభవంగా’ తుస్సుమనిపించింది.
దశాబ్దాల నుంచి చూస్తున్న రొటీన్ టెంప్లేట్లో సాగిన సినిమా పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. తొలి రోజు మ్యాట్నీల నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. వీకెండ్లో కూడా సినిమా నిలబడే ఛాన్సులు కనిపించలేదు. ఈ సినిమా మీద కేతిక పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యేట్లున్నాయి. యూత్‌ను బాగా ఆకర్షించే అంద చందాలు ఉన్నా.. అదృష్టం కలిసి రాక కేతిక కెరీర్‌కు బ్రేకులు పడిపోయాయి. ఈ దశ నుంచి ఇక ఆమె ఏమాత్రం పుంజుకుంటుందో చూడాలి.
This post was last modified on September 3, 2022 6:05 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…