నిఖిల్ సిద్దార్థ్.. ఇతణ్ని స్టార్ అనలేం. అలా అని మరీ ఇమేజ్ లేని హీరో ఏమీ కాదు. యూత్‌లో కొంచెం ఫాలోయింగ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడనే పేరుంది. ‘హ్యపీడేస్’లో లీడ్ రోల్స్ చేసిన మిగతా కుర్రాళ్లంతా అడ్రస్ లేకుండా పోతే.. ఇతను మాత్రం కష్టపడి నిలదొక్కుకున్నాడు. ఒక దశలో నిఖిల్ కూడా తప్పటడుగులు వేసి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయేలాగే కనిపించాడు. కానీ యువ దర్శకుడు సుధీర్ వర్మతో చేసిన ‘స్వామి రారా’ అతడి కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది.
అక్కడ్నుంచి సినిమాల ఎంపికలో తన అభిరుచిని చాటుకుంటూ, భిన్నమైన దారిలో నడుస్తూ హీరోగా ఎదుగుతున్నాడు. ‘స్వామి రారా’ తర్వాత ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ పెద్ద హిట్లు పడ్డాయి అతడికి. కానీ తర్వాత మళ్లీ కొన్ని ఎదురు దెబ్బలు తప్పలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘అర్జున్ సురవరం’ ఓ మోస్తరుగా ఆడింది. కానీ కెరీర్ పుంజుకోవడానికి ఇంకా పెద్ద సక్సెస్ అవసరమైంది.
కానీ కొవిడ్ కారణంగా నిఖిల్ సినిమాలు అనిశ్చితిలో పడి.. మూడేళ్ల పాటు రిలీజ్ లేకుండా గడిపేశాడు నిఖిల్. చివరికి ‘కార్తికేయ-2’ను ఎన్నో ఇబ్బందులు దాటి రిలీజ్ చేయగలిగారు. ఈ చిత్రం అతడి నిరీక్షణకు, కష్టానికి సరైన ఫలితమే అందించింది. ఒక పెద్ద సినిమా స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేస్తూ 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సినిమా ఎంత గొప్ప టాక్ వచ్చినా సరే.. మహా అయితే రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ వంద కోట్ల తర్వాత కూడా స్ట్రాంగ్‌గా నిలబడింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. టాలీవుడ్లో ఇప్పటిదాకా 100 కోట్ల క్లబ్బులో చేరిన హీరోలు 11 మంది మాత్రమే. అందులో రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి.. వీళ్లు ఆ క్లబ్బులో చేరడం చాలా మామూలు విషయం.
వీళ్లు కాకుండా ‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండ ఆ క్లబ్బులోకి చేరి ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ కూడా ‘అఖండ’తో చాలా లేటుగా ఈ ఫీట్ అందుకున్నాడు. వెంకటేష్, వరుణ్‌తేజ్‌లకు అదృష్టం కలిసొచ్చి ‘ఎఫ్-2’తో ఈ మార్కు చేరుకోగలిగారు. ఇలాంటి అరుదైన క్లబ్‌లో నిఖిల్ చేరతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ‘కార్తికేయ-2’తో అతను ఈ మ్యాజిక్ మార్కును చేరుకోగలిగాడు.
This post was last modified on September 3, 2022 4:39 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…