పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా తీస్తున్నాడు వేణు శ్రీరామ్. రెండేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ఏరి కోరి దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వేణును దర్శకుడిగా ఎంపిక చేయడంతో అతడి పేరు చర్చనీయాంశంగా మారింది.
అతను ఇప్పటిదాకా తీసింది రెండే సినిమాలు. అందులో తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. రెండో సినిమా ‘ఎంసీఏ’ బాగానే ఆడింది. ఐతే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా తొలి అవకాశం అందుకుంటే ఆ చిత్రం తనకు ఏ రకంగానూ కలిసి రాలేదని అంటున్నాడు వేణు. ఆ చిత్రం రిలీజైన రోజు అమ్మానాన్నలు సహా కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూశానని.. కానీ ఆ ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైందని వేణు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
తనకు నిరాశ కలిగించింది ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ఫలితం కాదని.. అసలు ఆ సినిమా రిజల్ట్ ఏంటో కూడా తాను పట్టించుకోలేదని.. అందుక్కారణం ఆ చిత్రం విడుదలైన తర్వాతి రోజు తన తండ్రి చనిపోవడమే అని అతను వెల్లడించాడు. తమ స్వస్థలంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పనులను పర్యవేక్షించడం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన తన తండ్రి.. పై అంతస్థు నుంచి ప్రమాద వశాత్తూ కిందపడి చనిపోయారని.. అది తన జీవితంలో అతి పెద్ద విషాదం అని.. దాన్నుంచి కోలుకోవడానికి నెల పైనే పట్టిందని.. ఆ పరిస్థితుల్లో ‘ఓ మై ఫ్రెండ్’ ఫలితమేంటి.. ఆ సినిమా ఎలా ఆడుతోంది.. అన్నది కూడా తెలుసుకోలేదని.. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదని తెలిసిందని వేణు తెలిపాడు.
తన తండ్రి మరణంతోనే తన సంతోషాలన్నీ పోయాయని.. తన తొలి చిత్రం సరిగా ఆడలేదని.. ఆ తర్వాత ఓ స్టార్ హీరోతో (రవితేజ) సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ సహా కొందరు స్టార్ల కోసం కథలు రాస్తే ఏవీ వర్కవుట్ కాలేదని.. చిన్న హీరోలను ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని.. దీంతో ఏడేళ్ల గ్యాప్ వచ్చిందని.. చివరికి నాని ‘ఎంసీఏ’ కథకు పచ్చ జెండా ఊపడంతో ఆ సినిమా చేసి హిట్టు కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని అతను వెల్లడించాడు.
This post was last modified on July 5, 2020 11:17 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…