తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ‘రీ రిలీజ్’ హంగామా నడుస్తోంది. పెద్ద హీరోల పుట్టిన రోజును పురస్కరించుకుని వాళ్ల కెరీర్లలో అతి పెద్ద విజయాలు సాధించిన సినిమాలను స్పెషల్ షోలుగా వేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే కానీ.. ఈ ఏడాది మాత్రం అవి కనీ వినీ ఎరుగనంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ముందుగా మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ‘పోకిరి’, ‘ఒక్కడు’ చిత్రాలకు భారీగా షోలు వేయడం.. కళ్లు చెదిరే రికార్డులు నమోదవడం చర్చనీయాంశం అయింది.
ముఖ్యంగా పోకిరి మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాక సౌత్ ఇండియన్ మేజర్ సిటీస్‌లో, అలాగే యుఎస్‌లో 370కి పైగా షోలు వేయడం, కోటిన్నరకు పైగా గ్రాస్ రావడం సంచలనం రేపింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును సందర్భంగా ‘జల్సా’కు స్పెషల్ షోలు వేయగా.. ‘పోకిరి’ రికార్డులన్నీ బద్దలైపోయాయి. దీనికి షోలు, అలాగే కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో కొత్త రికార్డులు నమోదయ్యాయి.
‘పోకిరి’ షోల సందర్భంగా మహేష్ అభిమానులు.. ‘జల్సా’ షోల టైంలో పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్లలో సెలబ్రేషన్స్ వేరే లెవెల్ అనిపించాయి. ఈ యుఫోరియా చూసి వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా అవాక్కయ్యారు. తెలుగు హీరోల ఫ్యాన్స్ రేంజే వేరని కొనియాడారు. వేరే హీరోల అభిమానులు కూడా తామూ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ స్పెషల్ షోల సందర్భంగా అభిమానుల అత్యుత్సాహం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.
‘పోకిరి’ షోల సందర్భంగా కొన్ని చోట్ల థియేటర్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా కాకినాడలో ఒక థియేటర్‌కు జరిగిన నష్టం చూసి ఇకపై ఇలాంటి స్పెషల్ షోలు వేయొద్దని అక్కడి ఎగ్జిబిటర్లందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ‘జల్సా’ షోల టైంలో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించవద్దని విన్నపాలు కూడా వెళ్లాయి. అయినా పవన్ ఫ్యాన్స్ జాగ్రత్త పడలేదు. వైజాగ్‌లోని లీలా మహల్ థియేటర్‌ను దారుణంగా దెబ్బ తీశారు. స్క్రీన్ చింపేశారు. సీట్లు విరిచేశారు. ఆ థియేటర్‌కు లక్షల్లో నష్టం వాటిల్లింది. దీని గురించి వాపోతూ థియేటర్ ప్రతినిధి మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పించేలా ఉన్నాయి.
జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు.. థియేటర్ బాగయ్యే వరకు అందులో పని చేసే వారి ఉపాధి సంగతేంటి అంటుంటే అయ్యో అనిపిస్తోంది. ఇదంతా చూశాక కాకినాడ ఎగ్జిబిటర్ల తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు ఆలోచిస్తే ఆశ్చర్యం లేదు. ఈ షోల వల్ల వచ్చే ఆదాయంటే జరిగే నష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? థియేటర్లో సంబరాలు చేసుకోవడం వరకు ఓకే కానీ.. కాస్తయినా ఇంగితం లేకుండా స్క్రీన్లు, సీట్లు ధ్వంసం చేసే అభిమానులను ఏమనాలి? ఇలాంటి వాళ్ల వల్ల హీరో ఇమేజ్‌కు కూడా చాలా డ్యామేజ్ జరుగుతోందని గుర్తించడం అత్యావశ్యకం.
This post was last modified on September 3, 2022 3:59 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…