బడా సినిమాల హంగామా పూర్తవడంతో ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు, మీడియం రేంజ్, చిన్న సినిమాలు ప్రతీ వారం థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నాయి. వచ్చే వారం అంటే సెప్టెంబర్ 9న కూడా కొన్ని రిలీజ్ లు ఉన్నాయి. ముఖ్యంగా రన్బీర్ కపూర్, అలియా నటించిన బ్రహ్మాస్త్ర ఆరోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సౌత్ లో రాజమౌళి ప్రెసెంట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగులో హైప్ వచ్చింది. పైగా నాగార్జున , అమితాబ్ నటించడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కడం తో బ్రహ్మాస్త్ర పై తెలుగులోనూ మంచి బజ్ ఉంది.
అలాగే అదే రోజు శర్వానంద్ కూడా ‘ఒకేఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శర్వా ప్రీవియస్ సినిమాలు సరిగ్గా ఆడలేదు. హీరోగా హిట్టు కొట్టి చాలా రోజులవుతుంది. అందుకే ఈ బైలింగ్వల్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. టీజర్ ,ట్రెయిలర్ తో కొంత బజ్ తీసుకొచ్చుకున్నాడు. ఇంటర్వ్యూల్లో కూడా తన కెరీర్ లో బెస్ట్ స్క్రిప్ట్ ఇదంటూ చెప్పుకుంటున్నాడు. అయితే సెప్టెంబర్ 9న మరో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది. అదే కిరణ్ అబ్బవరం.. నేను మీకు బాగా కావాల్సిన వాడిని.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల క్రితం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు సినిమాను ఉన్నపళంగా వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితంతో కాంపిటీషన్ లేకుండా సెప్టెంబర్ 16 కి వాయిదా వేసుకున్నారని సమాచారం. సో సెప్టెంబర్ 9 రేస్ నుండి కుర్ర హీరో తప్పకున్నట్టే. మరికొన్ని గంటల్లో మేకర్స్ నుండి పోస్ట్ పోన్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. కోడి రామకృష్ణ తనయురాలు కోడి దివ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ గాదె దర్శకుడు.
This post was last modified on %s = human-readable time difference 1:51 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…