Movie News

బాలీవుడ్ రాక్షసుడు ఎలా ఉన్నాడు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లో పెద్ద హిట్టుగా నిలిచిన సినిమా 2019లో వచ్చిన రాక్షసుడు ఒకటే. తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ రీమేక్ గా వచ్చిన ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోనూ కమర్షియల్ గా బాగా పే చేసింది. దీన్నే కొంత ఆలస్యంగా హిందీలో పునఃనిర్మించారు. ఇటీవలి కాలంలో థియేట్రికల్ గా వరస డిజాస్టర్లు చూస్తున్న అక్షయ్ కుమార్ హీరోగా ఇది రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంటర్ కాగా క్యాస్టింగ్ మొత్తం అక్కడి ఆడియన్స్ కి తగ్గట్టు మార్చేశారు. డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేశారు.

కథ బ్యాక్ డ్రాప్ ని హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి పట్టణానికి సెట్ చేశారు. వరసగా టీనేజ్ అమ్మాయిల హత్యలు జరగడం, డిపార్ట్ మెంట్ లో అండర్ డాగ్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ కేసును ఛేదించడం ఇలా మెయిన్ పాయింట్ మొత్తం అదే తీసుకున్నారు. కాకపోతే సైకో ఫ్లాష్ బ్యాక్ ని బాగా కుదించేసి క్లైమాక్స్ లో స్పీడ్ పెంచారు. అంతే కాదు ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే నిడివి కూడా తగ్గించేశారు. టెంప్లేట్ అయితే కొద్దిపాటి మార్పులతో ఫాలో అయ్యారు కానీ రాక్షసుడులోని ఫీల్ ని పూర్తి స్థాయిలో మోయలేకపోవడంతో కట్ పుత్లీ ఆశించినంత వేగంగా సాగదు.

దర్శకుడు రంజిత్ ఎం తివారి ప్రతిభ కొన్ని సన్నివేశాల్లో కనిపించినప్పటికీ మొత్తంగా చూస్తే అంచనాలను అందుకోవడంలో తడబడ్డాడు. తెలుగు తమిళంలో ప్రాణంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హిందీలో మాత్రం తేలిపోయింది. చిరంజీవి సైరా నరసింహారెడ్డికి నేపధ్య సంగీతం అందించిన జూలియస్ పకియం దీనికి పనిచేశాడు. అయితే గిబ్రాన్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాడు. అతన్నే తీసుకున్నా బాగుండేది. యూత్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ ని అక్షయ్ చేయడం కొంత మైనస్ అయ్యింది. లేడీ పోలీస్ ఆఫీసర్ ని ఇందులో మార్చేయడం తేడా చేసింది. ఫైనల్ గా చెప్పాలంటే బాలీవుడ్ రాక్షసుడు గాండ్రించబోయే క్యార్ మని సరిపెట్టాడు.

This post was last modified on September 3, 2022 6:21 am

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

52 minutes ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

2 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

3 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

5 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

7 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

7 hours ago