మాములుగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఒకే ఊరిలో ఉన్న థియేటర్లు ఒకప్పుడు రీళ్లను ఒక చోటు నుంచి మరో చోటికి రవాణా చేసి పంచుకునేవారు. కాకపోతే షో టైమింగ్స్ లో కనీసం అరగంటకు పైగా గ్యాప్ ఉండేది. శాటిలైట్ ద్వారా డిజిటల్ అయ్యాక ఈ సమస్య తీరిపోయి ఎన్ని స్క్రీన్లు ఉన్నా కేవలం సిగ్నల్ వ్యవస్థ ద్వారా ఒకేసారి ప్రదర్శించే అవకాశం దక్కింది. దీనివల్ల ఏరియాల వారీగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులు తమకు దగ్గరగా అనుకూలంగా ఉండే హాలుకు ఎంచక్కా కోరుకున్న మూవీని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు.
ఇప్పుడీ స్ట్రాటజీని ఓటిటిలు కూడా ఫాలో అవుతున్నాయి. సబ్స్క్రైబర్స్ అందరూ అన్నీ యాప్స్ కి డబ్బులు కట్టరు కాబట్టి వాళ్ళను ఆకట్టుకునేందుకు షేరింగ్ పద్దతిలోకి వెళ్తున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన విక్రమ్ హిట్ లిస్ట్ ఇటీవలే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిది జీ5లోనూ అందుబాటులోకి రానుంది. గతంలో వీటి మధ్య ఇలాగే ఆర్ఆర్ఆర్ పంపకం జరిగింది. కాకపోతే రెండింటి మధ్య డేట్స్ పరంగా కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ వ్యూయర్స్ చూసేందుకు వేసిన ఎత్తుగడ ఇది.
అలా అని ఇది కొత్త ప్లానేం కాదు. ఆ మధ్య గోపీచంద్ పక్కా కమర్షియల్ ని ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చారు. గ్లోబల్ రీచ్ కోసం చేసిన ఈ పని మంచి ఫలితాన్నే ఇచ్చింది. గతంలో అల వైకుంఠపురములోని ఇదే తరహాలో నెట్ ఫ్లిక్స్ తో సన్ నెక్స్ట్ వాటాలు వేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. ఒక్క అమెజాన్ ప్రైమ్ మాత్రమే కొత్త సినిమాలకు ఇలా డివైడ్ అండ్ షేర్ సూత్రానికి నో చెబుతోంది. పాత చిత్రాలకు మాత్రమే ఆ వెసులుబాటు ఇస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇదో కామన్ ప్రాక్టీస్ గా మారినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on September 2, 2022 9:01 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…