అదేంటి చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమా టికెట్ అయినా సింగల్ స్క్రీన్లలోనూ కనీసం 150 రూపాయలు ఉంటున్న పరిస్థితుల్లో ఇందులో సగానికి అది కూడా మల్టీ ప్లెక్సుల్లో అంటే ఆశ్చర్యపోతున్నారా. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇక్కడ చెప్పింది ముమ్మాటికీ నిజం. కాకపోతే ఇది ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కానుంది. సెప్టెంబర్ 16 ఇండియాలో నేషనల్ సినిమా డేగా పాటిస్తారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ ఏ రిలీజ్ ఉన్నా సరే కేవలం 75 రూపాయలకు టికెట్లు అమ్ముతారట.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో పివిఆర్, ఐనాక్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు భాగం కాబోతున్నాయి. అయితే ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉంటాయి. అలా వద్దనుకుంటే నేరుగా బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్బులిచ్చి తీసేసుకోవడమే. మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(MAI) ఈ పథకానికి థాంక్ యు అనే పేరు పెట్టింది. ఇక్కడే కాదు అమెరికాలోనూ కేవలం 3 డాలర్లకు స్క్రీనింగ్ చేయబోయే వెసులుబాటుని అక్కడి ఆడియన్స్ కి ఇవ్వబోతున్నారు
ఇది నిజంగా మంచి పరిణామమే. దీంతో పాటు వారానికి లేదా నెలకో రోజు ఇలాంటి ప్రత్యేక ధరలతో టికెట్లు పెడితే ఎక్కువ మధ్య తరగతి ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసే అవకాశం దక్కుతుంది. 9న రాబోయే ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మస్త్రతో పాటు మన తెలుగు సినిమాలు కూడా ఈ ఛాన్స్ ని వాడుకుంటాయేమో చూడాలి. బుకింగ్ యాప్స్ లో వెబ్ సైట్స్ లో ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇలాంటి స్కీములు మరికొన్ని తీసుకొస్తే భవిష్యత్తులో ఓటిటిలు వదిలి మెజారిటీ పబ్లిక్ హాళ్లకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాదంటారా..
This post was last modified on September 2, 2022 6:46 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…