Movie News

వాళ్ళ సినిమాలు.. టచ్ చేయలేను

తొలి సినిమా ‘ఉప్పెన’తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్, పాత్ర ఎంచుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక రెండో సినిమాగా ‘కొండపొలం’ లాంటి మరో ప్రయోగాత్మక కథలో నటించాడు. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్.. తన మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను అనుకరించినట్లుగా ప్రోమోల్లో కనిపించింది.

ఈ పోలికలు చూసి చిరు, పవన్ సినిమాలను వైష్ణవ్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ మెగా అభిమానుల్లో నడిచింది. ఐతే వైష్ణవ్ మాత్రం అలాంటివ ప్రయత్నం ఎప్పుడూ చేయనని తేల్చి చెప్పేశాడు. కానీ ఈ స్టేట్మెంట్‌కు అతను చిన్న రైడర్ పెట్టాడు.. మావయ్యల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్ చేయాలని అస్సలు అనుకోను. నా ఆలోచన అయితే ఇదే. కానీ ఒకవేళ ఎవరైనా వచ్చి  ఇది బాగుంటుంది, నువ్వే చేయాలి అంటే మాత్రం ‘బద్రి’ని రీమేక్ చేస్తే బాగుంటుందనుకుంటున్నా.. అని వైష్ణవ్ చెప్పాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడిగితే.. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఎన్.శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా మినహా కొత్తగా ఏదీ అంగీకరించలేదని చెప్పాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని వైష్ణవ్ తెలిపాడు.

‘కొండపొలం’ తర్వాత తాను చాలా కథలు విన్నానని.. అవేవీ సంతృప్తినివ్వలేదని.. చివరికి గిరీషయ్య చెప్పిన ‘రంగ రంగ వైభవంగా’ కథ నచ్చి సినిమా చేసినట్లు అతను వెల్లడించాడు. ఈ చిత్రంలో ఖుషి, నిన్నే పెళ్ళాడతా’ సినిమాల ఫ్లేవర్ కనిపించినట్లు కొందరు అన్నారని.. కానీ ఆ సినిమాలకు, దీనికి పోలిక ఉండదని.. కేతికకు, తనకు మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు హైలైట్ అని అతను చెప్పాడు.

This post was last modified on September 2, 2022 2:03 pm

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

38 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

41 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

60 minutes ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago