ఫిలిం ఇండస్ట్రీలో డ్రీమ్ డెబ్యూ ఏంటి అంటే.. మెగా ఫ్యామిలీ నుంచి చివరగా హీరోగా అరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్‌నే చూపించాలి. మామూలుగా ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్ నుంచి హీరోగా అరంగేట్రం చేసే కుర్రాడు మాస్, యాక్షన్ అంశాలతో ముడిపడ్డ సినిమానే ఎంచుకుంటాడు. కానీ వైష్ణవ్ మాత్రం ఫక్తు ప్రేమకథతో అరంగేట్రం చేశాడు. అందులో కూడా షాకింగ్‌గా అనిపించే పాత్రకు జై కొట్టాడు. అతను చేసిన సాహసానికి గొప్ప ఫలితమే దక్కింది.
టాలీవుడ్లో డెబ్యూ హీరో సినిమా రికార్డులన్నింటినీ అది బద్దలు కొట్టేసింది. ఇంత ఘనవిజయం అందుకున్నాక వైష్ణవ్ రెండో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. కానీ ‘కొండపొలం’తో అతను ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. అది మంచి సినిమానే, వైష్ణవ్ కూడా బాగా చేశాడు. కానీ అది ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. దీంతో వైష్ణవ్ కెరీర్ తిరోగమనంలో నడిచింది. దీంతో ఇప్పుడు మళ్లీ అతను ఒక మంచి హిట్ కొట్టాల్సిన స్థితికి చేరాడు. ఈ సమయంలోనే ‘రంగ రంగ వైభవంగా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వైష్ణవ్.
తొలి రెండు చిత్రాలకు భిన్నంగా ఫుల్ ఎంటర్టైనింగ్ మోడ్‌లో సాగే ‘రంగ రంగ వైభవంగా’తో తిరిగి తాను సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ధీమాగా ఉన్నాడు వైష్ణవ్. ఈ చిత్రం అతడితో పాటు దర్శకుడు గిరీశయ్యకు, హీరోయిన్ కేతిక శర్మకు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు చాలా కీలకం. గిరీశయ్య తమిళంలో ‘ఆదిత్య వర్మ’తో హిట్ కొట్టినప్పటికీ అది ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కావడంతో ఫుల్ క్రెడిట్ అతడికి దక్కలేదు. ఇప్పుడు తన సొంత కథతో అతను తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు.
ఇక ‘రొమాంటిక్’తో కథానాయికగా పరిచయం అయిన కేతిక శర్మకు ఇంకా తొలి విజయం దక్కలేదు. రెండో చిత్రం ‘లక్ష్య’ సైతం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక సీనియర్ నిర్మాత ప్రసాద్ సైతం మంచి విజయం కోసం చూస్తున్నాడు. ఆయనకు ‘మిస్టర్ మజ్ను’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి ఇంత మంది ఆశలను ‘రంగ రంగ వైభవంగా’ ఏమేర నిలబెడుతుందో చూడాలి. పాటలు, ప్రోమోల వల్ల ప్రి రిలీజ్ బజ్ బాగానే ఉన్న ఈ సినిమాకు మంచి టాక్ వస్తే పెద్ద హిట్టయ్యే అవకాశముంది.
This post was last modified on September 2, 2022 10:54 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…