కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్ జరగడం కన్నా ఒక సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం నిర్మాతలకు అతి పెద్ద సవాల్ గా మారుతోంది. ఎంత క్లాష్ వద్దనుకున్నా సరే రకరకాల కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఢీ కొట్టేసుకుంటున్నారు. దీనివల్ల ఓపెనింగ్స్ తో పాటు రన్ కూడా దెబ్బ తింటున్నప్పటికీ కేవలం కంటెంట్ మీద నమ్మకంతో దూకేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ టాలీవుడ్ బాక్సాఫీస్ కుర్ర హీరోల ఫైటుకు వేదికగా మారబోతోంది.
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’కు ఆ డేట్ కన్నా మంచి ముహూర్తం దొరకలేదు. పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘అల్లూరి’ని అదే రోజున బరిలో దింపుతున్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ప్రెస్ మీట్ కు సైతం ఖాకీ దుస్తుల్లో రావడం చూస్తుంటే నెక్స్ట్ చేయబోయే ప్రమోషన్లు ఇంకెంత వెరైటీగా చేస్తారో అనిపిస్తోంది.
మత్తు వదలరాతో ఆడియన్స్ లో రిజిస్టరైన సింహ కోడూరి ‘దొంగలున్నారు జాగ్రత్త’ వీటితో తలపడనుంది, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్ అందండలు ఉన్నాయి కాబట్టి పబ్లిసిటీ విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటే అంచనాలు రేపొచ్చు. కాకపోతే మ్యాటర్ బాగుంటేనే ఆడుతుంది అది వేరే విషయం. ఇక సత్యదేవ్ తమన్నాల కన్నడ సూపర్ హిట్ రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వచ్చి చివరాఖరికి 23నే బెస్ట్ ఆప్షన్ గా ఫిక్స్అయ్యింది.
ఇక్కడ చెప్పిన నాలుగు సినిమాల్లోని హీరోలకు పెద్దగా చెప్పుకునేంత భారీ మార్కెట్ ఏమీ లేదు. కాకపోతే ఎవరికి వారు బోలెడు ధీమాగా ఉన్నారు. థియేటర్ కొచ్చిన జనాన్ని మెప్పిస్తామనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. పెద్దగా బడ్జెట్ ఖర్చు పెట్టని చిత్రాల విషయంలో ఆడియన్స్ ఈ మధ్య బాగా నిక్కచ్చిగా ఉంటున్నారు. మరి ఈ నాలుగూ విజువల్ గ్రాండియర్స్ కాదు. అలాంటప్పుడు కంటెంట్ తో ఎలా నెగ్గుకొస్తాయో చూడాలి.
This post was last modified on September 2, 2022 7:01 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…