సూపర్ స్టార్ మహేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో చాన్నాళ్ళకి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘అతడు’తో మెప్పించిన ఈ కాంబో ‘ఖలేజా’ తో నిరాశ పరిచింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ప్రయత్నించినా ఇప్పటికి కుదిరింది. త్వరలోనే ఈ కాంబో సినిమా పట్టాలెక్కనుంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా మొదలయ్యే లోపు మహేష్ కొన్ని కమర్షియల్ కమిట్మెంట్స్ ఫినిష్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ వాటితో బిజీ అయిపోయాడు. బ్రాండ్ అడ్వర్టైజ్ మెంట్స్ , టివీ సీరియల్ ప్రమోషన్స్ అంటూ వర్క్ చేస్తున్నాడు. అయితే మహేష్ బాబుకు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా సక్సెస్ అవ్వడం చాలా కీలకం. దీనికి చాలా కారణాలున్నాయి. మహేష్ నుండి ఓ సాలిడ్ హిట్ వచ్చి చాలా ఏళ్లయింది. ‘శ్రీమంతుడు’ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి తప్ప భారీ వసూళ్ళు అందించలేదు. ‘భరత్ అనే నేను’ చాలా చోట్ల లాస్ మిగిల్చింది. ఈ విషయాన్ని కొరటాల స్వయంగా చెప్పుకున్నాడు కూడా.
ఇక మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట సినిమాలు కంటెంట్ పరంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి. సరిలేరు మాత్రం సంక్రాంతి సీజన్ లో మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాతో మహేష్ ఓ సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మహేష్ రాజమౌళి తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొడితే ఆ ప్రాజెక్ట్ కి చాలా ప్లస్ అవుతుంది. లేదంటే రాజమౌళి సక్సెస్ తోనే దాన్ని మార్కెట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మహేష్ కి ఆ ప్రాజెక్ట్ ముందు సాలిడ్ హిట్ ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది.
ఇక మహేష్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా థియేటర్స్ కి తీసుకొచ్చే క్లాస్ సినిమా కూడా ఈ మధ్య రాలేదు. సూపర్ స్టార్ నుండి రీసెంట్ గా అన్నీ కమర్షియల్ సినిమాలే వచ్చాయి. మహర్షిలో క్లాస్ టచ్ ఉన్నా ఆ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్నంతగా రాలేదు. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే కథలోనే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఈసారి టాక్ బాగుంటే థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ గట్టిగా కనిపిస్తారు. సో ఎలా చూసుకున్నా మహేష్ SSMB28 తో ఓ సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇన్నేళ్ళ తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ సూపర్ స్టార్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on September 1, 2022 10:20 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…