Movie News

పూరి – కొరటాల నేర్చుకుందేమిటి?

స్టార్ డైరెక్టర్స్ నుంచి వచ్చే సినిమా అంటే మినిమం ఎంటర్టైన్ మెంట్ పక్కా అని ఫిక్సయిపోతుంటారు ఆడియన్స్. కొత్త దర్శకులు సూపర్ హిట్లు కొడుతున్న ఈ తరుణంలో స్టార్ డైరెక్టర్స్ తమ సత్తా చాటి బ్లాక్ బస్టర్స్ అందించి కొత్తవారికి ఛాలెంజ్ విసురుతారని అనుకుంటారు. కానీ కొరటాల శివ , పూరి మాత్రం ఆడియన్స్ కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా డిజాస్టర్స్ డెలివరీ చేశారు. ఈ ఇద్దరు దర్శకుల నుండి వచ్చే ‘ఆచార్య’, ‘లైగర్’ పెద్ద హిట్స్ సాధించి తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయని అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చారు.

కొరటాల అంటే మాస్. సందేశాన్ని కమర్షియల్ యాక్షన్ అంశాలతో పర్ఫెక్ట్ గా చెప్పి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇలాంటి డైరెక్టర్ కి చిరు పడితే ఎలా ఉంటుంది ? ఇద్దరూ కలిసి ఓ మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని అందరూ ఊహించారు. మెగా స్టార్ ని కొరటాల మాస్ గా చూపిస్తూ ఓ మంచి సందేశం ఇచ్చి మెస్మ్జరైజ్ చేస్తాడని అనుకున్నారు. కానీ కొరటాల ‘ఆచార్య’ తో ఓ డిజాస్టర్ డెలివరీ చేసి ఇటు మెగా ఫ్యాన్స్ ని అటు ఆడియన్స్ ని నిరాశపరిచాడు. కొరటాల చేసిన గాయాన్ని మెగా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా చిరు కేరెక్టర్ డిజైనింగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వారిని బాగా నిరాశ పరిచి నీరసం తెప్పించాయి.

ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే… పూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ , డైలాగ్స్ , రైటింగ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కొన్నేళ్ళుగా సాదా సీదా సినిమాలు ఇస్తూ వచ్చిన పూరి ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ ని మెప్పించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. రామ్ లాంటి లవర్ బాయ్ ని ఊరా మాస్ గా ప్రెజెంట్ చేసి సర్ప్రైజ్ చేసిన పూరి ‘లైగర్’ తో పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ తీరా చూస్తే పూరి కొరటాల దారిలోనే వెళ్లి రౌడీ ఫ్యాన్స్ ని , ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేశాడు. ఇక మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో సినిమా చివర్లో కామెడీ చేయించి పూరి విమర్శల పాలయ్యాడు.

ఒక వైపు శశి కిరణ్ తిక్కా, చందూ మొండేటి, హను రాఘవపూడి లతో పాటు వసిష్ట అనే కొత్త దర్శకుడు సూపర్ హిట్ సినిమా డెలివరీ చేస్తుంటే స్టార్ డైరెక్టర్స్ గా ఎంతో ఇమేజ్ ఫ్యాన్ బేస్ ఉన్న కొరటాల , పూరి మాత్రం డిజాస్టర్స్ ఇచ్చి కెరీర్ ని డౌన్ చేసుకున్నారు. ఇప్పటికైనా వారి మిస్టేక్స్ తెల్సుకొని నెక్స్ట్ సినిమాలకు ఇలా జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ నుండి వచ్చిన కంటెంట్ చూసి మిగతా స్టార్ డైరెక్టర్స్ కూడా జాగ్రత్త పడితే బెటర్ లేదంటే వారి నుండి కూడా ఇలాంటి కళాఖండాలు వచ్చే అవకాశం ఉంది.

This post was last modified on September 1, 2022 10:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

7 minutes ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

34 minutes ago

అమిత్ షాకు షర్మిల కౌంటర్

పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…

39 minutes ago

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

2 hours ago

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

2 hours ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

2 hours ago