కెరీర్ కొంచెం ఒడుదొడుకుల్లో ఉన్న నిఖిల్ అనే యంగ్ హీరో.. అనుపమ పరమేశ్వరన్ అనే ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్.. చివరగా పెద్ద డిజాస్టర్ ఇచ్చిన చందూ మొండేటి అనే దర్శకుడు.. ఇలాంటి కలయికలో వచ్చిన సినిమా ‘కార్తికేయ-2’. సూపర్ హిట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్ అయినప్పటికీ.. ఈ చిత్రంపై మరీ అంచనాలైతే లేవు. సినిమా బాగా ఆలస్యం అయి, వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఆగస్టు 13న విడుదలైంది.
సినిమాకు మంచి టాక్ వచ్చినా సరే.. ఒక 30 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడా సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంటోంది. బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలకు కూడా ఈ మార్కును అందుకోవడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు. అలాంటిది కేవలం హిందీలోనే రూ.25 కోట్ల గ్రాస్ మార్కు దిశగా అడుగులు వేస్తోందీ చిత్రం.
హిందీ ప్రేక్షకులకు నిఖిల్ గురించి పెద్దగా తెలియదు. ‘కార్తికేయ’ అనే హిట్ మూవీకి ఇది సీక్వెల్ అని వాళ్లకు ఐడియా లేదు. రిలీజయ్యే ముందు వరకు ఈ సినిమాను పట్టించుకున్నదే లేదు. విడుదల కూడా నామమాత్రంగా జరిగింది. ప్రమోషన్లూ లేవు. కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. అక్కడి జనాలకు సినిమా ఎక్కేసింది. రోజు రోజుకూ దాని థియేటర్లు, షోలు విస్తరించాయి. సినిమా ఊహించని స్థాయికి చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ సాగింది.
మద్యలో వచ్చిన ఇండిపెండెన్స్ డే, ‘కృష్ణాష్టమి’ సెలవులను, మిగతా సెలవులను చక్కగా ఉపయోగించుకుందీ చిత్రం. ఇప్పుడు ‘వినాయక చవితి’ కూడా దానికి పెద్ద ప్లస్సే. ఇండియా అంతటా జనాలు పండుగ రోజు ఉండే మూడ్‌లో ‘కార్తికేయ-2’ లాంటి సినిమానే చూడాలనుకుంటారు. కాబట్టి తొలి వీకెండ్ రోజుల్లో మాదిరి బుధవారం వసూళ్లు రావడం గ్యారెంటీ. చవితి రోజే ఈ చిత్రం అధికారికంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకోబోతోంది. ఈ చిన్న సినిమాకు ఇది ఎంత గొప్ప ఫీటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on August 31, 2022 12:41 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…