కెరీర్లో చాలా ఏళ్లు ‘మహేష్ బాబు బావ’, ‘కృష్ణ అల్లుడు’ అనే గుర్తింపుతోనే ఇండస్ట్రీలో కొనసాగాడు సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలో అతడి ప్లస్సుల కంటే మైనస్‌లే ఎక్కువ కనిపించేవి. నటన అంత గొప్పగా అనిపించేది కాదు. వాయిస్ పెద్ద మైనస్ అనిపించేది. దీనికి తోడు సరైన సినిమాలు కూడా పడకపోవడంతో ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే ఎదుర్కొన్నాడు సుధీర్. కానీ కష్టపడి తన నటనను, డైలాగ్ డెలివరీని మార్చుకోవడమే కాక.. కొన్ని మంచి సినిమాలు చేయడం ద్వారా సుధీర్ తన మీద ఉన్న నెగెటివిటీనంతా పోగొట్టుకున్నాడు.
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం సినిమాలు తన మీద ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేశాయి. ముఖ్యంగా ‘సమ్మోహనం’ అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించి కమర్షియల్‌గానూ మంచి ఫలితాన్నందుకుంది. ఐతే తన కెరీర్‌ను ఇంకో దశకు తీసుకెళ్లే సినిమా కోసం అతను ఎదురు చూస్తున్నాడు.
సుధీర్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్’ సినిమాలు ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మరో ‘సమ్మోహనం’ అవుతుందన్న అంచనాలున్నాయి. ఈ సినిమాకు విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ డీల్స్ పూర్తయినట్లు సమాచారం. స్టార్ మా ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి శాటిలైట్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద రేటే.
సుధీర్ సినిమాలకు గతంలో మంచి టీఆర్పీలు రావడంతో అతడి సినిమాల శాటిలైట్ హక్కులకు మంచి డిమాండే ఉంది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే చిత్రాలు థియేటర్లలో సరిగా ఆడకున్నా.. టీవీల ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాయి. ‘సమ్మోహనం’ కూడా చాలా మంచి స్పందన తెచ్చుకుంది. ఓటీటీల్లో కూడా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’కి మంచి డీల్ దొరికినట్లుంది. దీని డిజిటల్ హక్కులు కూడా మంచి రేటే పలుకుతాయని అంచనా. సెప్టెంబరు 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on August 30, 2022 7:14 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…