మాములుగా ఓ పిసినారి టూత్ పేస్ట్ వాడకం ఎలా ఉంటుందంటే ట్యూబ్ ని చావచితకొట్టి చివరి బొట్టు దాకా మొత్తం పిండేశాకే బయట పారేస్తాడు. ఆమె సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్రను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ మరీ అంత దుర్మార్గంగా అందరూ ఉండరు కానీ ఈ మధ్యకాలంలో మన దర్శకుల ఫార్ములా తీరు ఇదే స్పష్టం చేస్తోంది. లైగర్ కు బాక్సాఫీస్ దగ్గర చావు దెబ్బ తప్పలేదు. ఎన్ని ప్రమోషన్లు చేసినా ఎన్నో గొప్పలు పోయినా ముంబై నుంచి మంగళగిరి దాకా ప్రేక్షకులు నిర్మొహమాటంగా ఒకే డిజాస్టర్ తీర్పు ఇచ్చేశారు.
కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ కూడా ఇదే తరహాలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అందులో ఉన్నది కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాపే. నాగ శౌర్య చాలా కష్టపడి ఆర్చరీ సెటప్ ఏదో ఆడియన్స్ కి కొత్తగా ఉంటుందని చేస్తే ‘లక్ష్య’ వారం తిరక్కుండానే బయ్యర్లకు చుక్కలు చూపించింది. కీర్తి సురేష్ ని నగేష్ కుకునూర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ డీల్ చేసినా గన్ షూటింగ్ క్రీడను, నీరసమైన స్క్రీన్ ప్లేని ‘గుడ్ లక్ సఖి’లో మనవాళ్ళు అంగీకరించలేదు. అంతెందుకు నాని ‘జెర్సీ’ ఎమోషనల్ గా ఎంత ఆకట్టుకున్నా కమర్షియల్ గా అద్భుతాలేం చేయలేదు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. రాను రాను ఈ స్పోర్ట్స్ డ్రామాలు జనానికి బోర్ కొట్టేస్తున్నాయి. ఒక ఆట, విధి రాతకు వంచితుడైన హీరో, అతనికో గురువు, ఇంటర్ నేషనల్ పోటీల్లో చివరిగా విజేతగా నిలవడం. ఈ పరిధి దాటి ఏ దర్శక రచయిత కొత్తగా ఆలోచించలేకపోతున్నాడు. అలాంటప్పుడు తీయకపోవడం మంచిది కదా. తెలుగు క్రికెటర్ మిథాలి రాజ్ కథను ‘శభాష్ మితు’గా చూపిస్తే ఎవరు పట్టించుకున్నారని. సో ఇకనైనా వీటికి స్వస్తి పలికి ఎలాంటి కంటెంట్ తో థియేటర్లను నింపగలమనే దాని మీద డైరెక్టర్లు దృష్టి పెడితే మంచిది. కార్తికేయ 2 కన్నా ఉత్తమమైన ఉదాహరణ ఇంకేం కావాలి.
This post was last modified on August 29, 2022 10:38 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…