ఈ శుక్రవారం అరడజను సినిమాలు

ప్రతి శుక్రవారం ఎదురు చూసినట్టే మూవీ లవర్స్ ఈసారి ఏ సినిమాలు వస్తాయాని వెయిట్ చేస్తున్నారు. లైగర్ టాక్ ప్రభావం గట్టిగా ఉండటంతో దాన్ని చూడకుండా డ్రాప్ అయినవాళ్లే ఎక్కువ. అందుకే సీతారామం, బింబిసారలు పాతిక రోజులకు దగ్గరగా ఉన్నా కూడా వీకెండ్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక కార్తికేయ 2 గురించి చెప్పాల్సిన పని లేదు. అడ్వాన్స్ బుకింగ్ లోనే శని ఆదివారాల టికెట్లు అమ్ముడుపోయాయి. వీటిని చూసేసినవాళ్లకు కొత్త ఆప్షన్లు కావాలి. అందులోనూ వినాయకచవితి పండగ వస్తున్న టైంలో.

సెప్టెంబర్ 2న మొత్తం అరడజను సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో మొదటిది వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా. ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు కానీ బజ్ తక్కువగా ఉండటం వల్ల టాక్ బాగా వస్తేనే నిలదొక్కుకుంటుంది. రెండోది ఫస్ట్ డే ఫస్ట్ షో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన ఈ ఎంటర్ టైనర్ కి రచన చేసిన జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దీనికి డైరెక్షన్ చేయకపోయినా పబ్లిసిటీ మొత్తం తానై నడిపిస్తున్నాడు. ఎప్పుడో పూర్తయిన బుజ్జి ఇలా రాని ఆగస్ట్ 26 నుంచి వాయిదా వేసి ఇదే డేట్ కి బరిలో దించుతున్నారు

ఇవి కాకుండా డైహార్డ్ ఫ్యాన్, ఆకాశ వీధుల్లో, నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా రేస్ లో ఉన్నాయి. తెలుగు స్ట్రెయిట్ సినిమాల వరకు కౌంట్ ఇది. రెండు రోజుల ముందు విక్రమ్ కోబ్రా వచ్చేసి ఉంటుంది కాబట్టి ఈ లిస్టులో కలపలేదు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎక్స్ టెండెడ్ వెర్షన్ ని ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం థియేటర్లలో వదులుతున్నారు. ఈటి ఎక్స్ ట్రా టెరెస్ట్రియల్ సైతం రానుంది. బాలీవుడ్ మూవీ కమాన్ యార్ వీటికి తోడయ్యింది. మొత్తానికి ఆప్షన్లు బోలెడు కనిపిస్తున్నాయి కానీ వీటిలో ఆగస్ట్ జోష్ ని కంటిన్యూ చేసేవేవో చూడాలి.