హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలతో పట్టువదలని విక్రమార్కుడిలా పలకరిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత ఏడాది ఛత్రపతి రీమేక్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో అదే టైటిల్ తో కొద్దిపాటి మార్పులతో సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేశారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం కావడంతో బడ్జెట్ విషయంలోనూ రాజీ లేకుండా చేస్తున్నారని టాక్ వచ్చింది. అయితే ఏమయ్యిందో ఏమో కానీ నెలల తరబడి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. వినాయక్ సైతం ఎక్కడా దాని ప్రస్తావన తేవడం లేదు.
ఈ సినిమా కోసమే ముంబైలో మకాం పెట్టేసిన సాయిశ్రీనివాస్ ఆ మధ్య స్టువర్ట్ పురం దొంగను హడావిడిగా ప్రకటించాడు. తీరా చూస్తే అదే కథతో రవితేజ ప్రాజెక్టు లాకవ్వడంతో తనది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. రాక్షసుడు హిట్టు కొట్టి తర్వాత అల్లుడు అదుర్స్ తో డిజాస్టర్ అందుకున్న శ్రీనివాస్ వచ్చే జనవరికి తెరమీద కనపడి రెండేళ్లు దాటుతుంది. ఎంత సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా డబ్బింగ్ శాటిలైట్ తదితరాల రూపంలో ఇతనికి మార్కెట్ అయితే ఉంది. అందుకే తెలుగులో సినిమాలు తీయాలనుకునే వాళ్ళు వస్తూనే ఉన్నారు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శ్రీనివాస్ ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నిఖిల్ కు అర్జున్ సురవరం రూపంలో మంచి హిట్ ఇచ్చిన టిఎన్ సంతోష్ చెప్పిన లైన్ ఒకటి ఆకట్టుకోవడంతో ఫైనల్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది. ఛత్రపతికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది కనక మరీ ఆలస్యం చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్షన్ లైట్ అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలోనే తీసుకోవచ్చని అంటున్నారు. తమ్ముడు గణేష్ అక్టోబర్ లో స్వాతిముత్యంతో వెండితెర ప్రవేశం చేస్తున్నాడు. ఈలోగా అన్నయ్య రీ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందో లేదో.
This post was last modified on August 29, 2022 8:22 am
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…