Movie News

ఔను.. ఆ హీరోకు క‌థ చెప్ప‌బోతున్నా

అనుదీప్ కేవీ..  జాతిర‌త్నాలు సినిమాతో ఈ పేరు మార్మోగిపోయింది. పిట్ట‌గోడ అనే ఎవ‌రికీ ప‌ట్ట‌ని చిన్న‌ సినిమాతో ద‌ర్శ‌కుడ‌గా ప‌రిచ‌యం అయిన ఈ కుర్రాడు.. జాతిర‌త్నాలుతో థియేట‌ర్ల‌ను న‌వ్వుల్లో ముంచెత్తాడు. ఆ చిత్ర నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కాసుల పంట పండించాడు. చిన్న సినిమాతో భారీ విజ‌యం సాధించ‌డంతో అత‌డికి క్రేజీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్‌తో పెద్ద బ‌డ్జెట్లో తెలుగు-త‌మిళ భాష‌ల్లో ప్రిన్స్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఈలోపు అనుదీప్ క‌థ అందించిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా మీడియాను క‌లిసిన అత‌ను.. త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లే తాను సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశ‌మున్న‌ట్లు అత‌ను సంకేతాలు ఇచ్చాడు.

వెంక‌టేష్‌కు త్వ‌ర‌లోనే తాను ఒక కామెడీ క‌థ‌ను న‌రేట్ చేయ‌బోతున్న‌ట్లు అనుదీప్ వెల్ల‌డించాడు. త‌మ క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చేందుకు ఆస్కార‌ముంద‌ని చెప్పాడు. దీనికి తోడు త‌న‌కు పెద్ద లైన‌ప్పే ఉన్న‌ట్లు అనుదీప్ వెల్ల‌డించాడు. వాటి వివ‌రాలు త‌ర్వాత చెబుతాన‌న్నాడు. నిజానికి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో క‌థ‌ను కూడా తానే డైరెక్ట్ చేయాల్సింద‌ని అనుదీప్ చెప్పాడు.

కానీ త‌న‌కు ఖాళీ లేక‌పోవ‌డం వ‌ల్ల‌, త‌న అసిస్టెంట్లయిన వంశీ,  ల‌క్ష్మీనారాయ‌ణ‌ల‌కు ఈ క‌థ న‌చ్చి, ఓన్ చేసుకోవ‌డంతో వారికి ఈ క‌థ‌ను తెర‌కెక్కించే బాధ్య‌త అప్ప‌గించిన‌ట్లు తెలిపాడు. త‌న జీవిత అనుభ‌వాల నేప‌థ్యంలోనే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో క‌థ రాశాన‌ని.. తాను నిజంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిని అని.. ఖుషి సినిమాకు తొలి రోజు టికెట్లు సంపాదించ‌డం క‌ష్ట‌మైంద‌ని.. ప‌వ‌న్ ప్ర‌తి సినిమానూ తాను తొలి రోజే చూడ‌టానికి క‌ష్ట‌ప‌డేవాడిన‌ని అనుదీప్ తెలిపాడు. రెండు రోజుల వ్య‌వ‌ధిలో న‌డిచే ఈ క‌థ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్విస్తుంద‌ని అనుదీప్ ధీమా వ్య‌క్తం చేశాడు.

This post was last modified on August 28, 2022 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago