గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఎంత పేలవమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వక్కంతం వంశీ కథతో చేసిన ‘టెంపర్’ మినహాయిస్తే ఆయనకు చాలా ఏళ్ల పాటు హిట్ లేదు. ‘టెంపర్’తో ఫాం అందుకున్నాడని అనుకుంటే.. జ్యోతిలక్ష్మి, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా లాంటి డిజాస్టర్లు తీసి తన స్థాయిని అమాంతం కింద పడేసుకున్నాడు పూరి. ఇలాంటి టైంలో ఆయన కెరీర్‌కు ఊపిరిలూదింది ‘ఇస్మార్ట్ శంకర్’.
అలా అని ఈ చిత్రం కూడా పూరి బెస్ట్ వర్క్స్‌లో ఒకటిగా నిలిచిదేమీ కాదు. అందులో కూడా కథా కథనాలు సాధారణంగానే అనిపిస్తాయి. కానీ ఆ టైంకి సినిమాకు అనుకోకుండా మంచి క్రేజ్ వచ్చింది. పాటలు, ప్రోమోలు, రామ్ క్యారెక్టర్ జనాలకు ఎక్కేసి సినిమా ఊహించని విజయం సాధించింది. కానీ చాలామంది దీన్ని ‘ఫ్లూక్ హిట్’ అనే అన్నారు. కాలం కలిసొచ్చి సినిమా హిట్టయిందే తప్ప పూరి ఏమీ ఫాంలోకి వచ్చేయలేదని కామెంట్లు చేశారు.
ఐతే ఈ కామెంట్లకు ‘లైగర్’తో పూరి సరైన సమాధానం చెబుతాడని, ‘ఇస్మార్ట్ శంకర్’ గాలి వాటం విజయం కాదని రుజువు చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. ‘లైగర్’ పూరి కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో, బడ్జెట్ సహా అన్ని వనరులూ చక్కగా కుదిరినప్పటికీ.. ఆయన ఉపయోగించుకోలేకపోయాడు. లైగర్ పాత్రను నిలబెట్టడానికి విజయ్ తన వంతుగా ఎంత కష్టపడ్డా, అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినా.. పూరి వీక్ రైటింగ్ వల్ల ఆ పాత్ర, మొత్తం సినిమా నీరుగారిపోయింది.
అసలు ఏం ఉందని ఈ కథను ఇంత భారీ స్థాయిలో తెరకెక్కించడానికి అందరూ సిద్ధపడ్డారు అన్నదే అర్థం కావడం లేదు. పూరి ఇంతకుముందు ఒకే స్టయిల్లో మాఫియా సినిమాలు తీసేవాడని విమర్శలు ఉండేవి. కనీసం అలాంటి సినిమాలు తీసినా ఓకే కానీ.. అసలు ఏ ప్రత్యేకతా లేని, ఒక్క మెరుపు కూడా కనిపించని ‘లైగర్’ లాంటి సినిమాలు తీసి ఏం ప్రయోజనం అంటున్నారు. ‘లైగర్’ ఫలితం చూశాక ‘ఇస్మార్ట్ శంకర్’ కచ్చితంగా ఫ్లూక్ హిట్టే అన్న అభిప్రాయం బలపడిపోయింది. ఈ స్థితి నుంచి పూరి ఇక కోలుకోవడం కష్టమే అంటున్నారు చాలామంది.
This post was last modified on August 27, 2022 11:18 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…