కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ట్రేడ్ వర్గాన్ని ,ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆశ్చర్య పరుస్తుంటాయి. ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అయితే చిన్న సినిమా అయినా దాన్ని నెత్తిన పెట్టుకొని ఎంత పెద్ద హిట్ చేస్తారో అన్నదానికి తాజా ఉదాహరణ కార్తికేయ 2. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసినప్పటి నుండి ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. తెలుగు రాష్ట్రల్లో అయితే ఈ సినిమాకు మినిమం థియేటర్స్ కూడా దక్కలేదు. అంతెందుకు బాలీవుడ్ లో కూడా తక్కువ థియేటర్స్ దక్కాయి. కానీ కంటెంట్ తో మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 100 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరుకుంది.
ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. అక్కడ రిలీజైన హిందీ సినిమాలను సైతం కార్తికేయ కలెక్షన్స్ అలవోకగా దాటేసింది. ఇక ఈ వారం లైగర్ సినిమా ఎఫెక్ట్ ఏమైనా నిఖిల్ సినిమా మీద పడుతుందేమో అనే అనమానాలు ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో ఇప్పుడు కార్తికేయ 2 కి కలిసొచ్చింది. దీంతో ఈ వీకెండ్ ఇక్కడ , అక్కడా కలిపి సినిమా మరో పది కోట్లు రాబట్టడం ఖాయమనిపిస్తుంది.
నిజానికి కొన్ని హిట్ సినిమాలకు అన్నీ కలిసొస్తాయి. అది కార్తికేయ 2 విషయంలో గమనించవచ్చు. ఈ సినిమాకంటే ముందు రోజు థియేటర్స్ లోకి వచ్చిన నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ డిజాస్టర్ అనిపించుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అలాగే బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్ష బంద్’ సినిమాలు ఆడకపోవడంతో అక్కడ కృష్ణతత్వంతో సినిమా మేజిక్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ చూస్తే కుర్ర హీరో నిఖిల్ కి కృష్ణుడి రూపంలో కార్తికేయ 2 పెద్ద సపోర్ట్ దక్కినట్టనిపిస్తుంది.
This post was last modified on August 27, 2022 1:17 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…