హాలీవుడ్లో బన్నీ.. హాలీవుడ్లో బన్నీ.. నిన్నట్నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను పురస్కరించుుకుని అమెరికాలో పరేడ్‌లో పాల్గొనేందుకు భార్య స్నేహా రెడ్డితో కలిసి అల్లు అర్జున్ వెళ్లడం తెలిసిందే. ఆ కార్యక్రమం సందడిగా సాగిందికూడా. ఐతే బన్నీ వెళ్లింది కేవలం ఈ పరేడ్ కోసమే కాదని.. అక్కడ ఒక హాలీవుడ్ దర్శకుడితో మీటింగ్ జరిగిందని, అతను బన్నీకి ఒక కథ చెప్పాడని, అందులో ఓ కీలక పాత్ర ఆఫర్ చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఐతే ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మాట వాస్తవం. అలా అని ఈ చిత్రం ప్రపంచ స్థాయికేమీ చేరిపోలేదు. మరీ హాలీవుడ్ స్థాయిలో బన్నీ పాపులర్ అయిపోలేదు. ఐతే ధనుష్ ఇంత పాపులర్ కాకముందే హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు కాబట్టి బన్నీకి అవకాశం లభిస్తే మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఐతే బన్నీ పీఆర్ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దేశంలోనే బన్నీకి ఉన్నంత పీఆర్ సపోర్ట్ ఇంకే హీరోకూ లేదు అంటే అతిశయోక్తి కాదు. అతడి గురించి రకరకాల హైప్ వార్తలు పుట్టించి సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో పబ్లిష్ చేయించి ప్రచారం చేయడం మామూలే. న్యూయార్క్‌లో జరిగిన పరేడ్‌లో 5 లక్షల మంది పాల్గొన్నట్లు బన్నీ పీఆర్వోలు ప్రకటనలు ఇచ్చారంటే వారి హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఏ ఫొటోలో కూడా వందల్లో తప్పితే కొన్ని వేల మంది జనాలు కూడా కనిపించలేదు. మరి అమెరికాలో బన్నీ కోసం ఐదు లక్షల మంది వచ్చారంటే ఎలా నమ్మాలి? ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ సినిమాలో బన్నీ అనే వార్త కూడా పబ్లిసిటీ గిమ్మిక్కేనేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘పుష్ప-2’ చేయడానికి ముందు బన్నీకి మరింత ఎలివేషన్ ఇచ్చి ఆ సినిమా రేంజి పెంచడానికే ఇలాంటి పీఆర్ గిమ్మిక్కులు ట్రై చేస్తున్నారేమో అనిపిస్తోంది.
This post was last modified on August 26, 2022 8:11 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…