Movie News

భారమంతా 2 ప్యాన్ ఇండియాల మీదే

ఒకవేళ లైగర్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో సీన్ వేరేగా ఉండేది. హిందీ వెర్షన్ ని ఒక రోజు ఆలస్యంగా విడుదల చేయాలనే స్ట్రాటజీ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడ తేడా కొట్టినా సాహోలాగా అక్కడ కొంత బెటర్ రిజల్ట్ తెచ్చుకునే సూచనలు తక్కువగానే ఉన్నాయి. ప్రభాస్ కాబట్టి దానికా మాత్రం వసూళ్లు వచ్చాయి. కానీ విజయ్ దేవరకొండకు కావడమే లైగర్ డెబ్యూ మూవీ అయ్యింది. అలాంటప్పుడు హీరో ఇమేజ్ అక్కడ పని చేసే అవకాశాలు లేనట్టే. ఇంకో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.

ఇక సెప్టెంబర్ లో రాబోయే రెండు ప్యాన్ ఇండియా సినిమాలే నార్త్ ట్రేడ్ ని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో మొదటిది బ్రహ్మాస్త్ర. ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు కానీ దానికి తగ్గ బజ్ న్యూట్రల్ ఆడియన్స్ లో కనిపించడం లేదు. ఈవెంట్లు ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి నాగార్జునలు చెన్నై వెళ్లి మరీ స్పెషల్ గా పబ్లిసిటీ ఇచ్చారు. నెక్స్ట్ రెండు భాగాలకు బిజినెస్ జరగాలంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో ఆడాలి. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది.

రెండోది మణిరత్నం పొన్నియన్ సెల్వన్. టైటిల్ తో మొదలుపెట్టి బ్యాక్ డ్రాప్ దాకా మొత్తం తమిళ వాసన కొడుతున్న ఈ గ్రాండియర్ తెలుగు హిందీ భాషల్లో ఏ మాత్రం పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి హైప్ పరంగా ఈ రెండు ఒకే స్టేజిలో ఉన్నాయి. ఏదో బాహుబలి రేంజ్ లో హడావిడి చేస్తాయనుకుంటే ఆ సూచనలు అంతగా లేవు. చేతిలో ఉన్న తక్కువ టైంని పూర్తిగా వాడుకుని జనాల్లో ఇంకా బలంగా దీన్ని తీసుకెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ మీద గట్టి ఫోకసే పెడుతున్నారు.

This post was last modified on August 25, 2022 10:35 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

13 minutes ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

1 hour ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

2 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

3 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

3 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

4 hours ago