ఏదో వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు కంటెంట్ ని క్వాలిటీని పట్టించుకోడని అక్షయ్ కుమార్ ని తిట్టిపోస్తారు కానీ నిజానికి అతనికున్న బిజినెస్ క్యాలికులేషన్స్ పేరుమోసిన ఖాన్లకు సైతం లేవన్నది వాస్తవం. అందుకే ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యధిక టాక్స్ కడుతున్న నటుల లిస్టులో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అక్షయ్ జయాపజయాలు పట్టించుకోడు. ఆ మధ్య నా ఫ్లాపులకు నేనే బాధ్యుణ్ణి అని చెప్పుకున్నాడు కానీ దానికి ఎంతవరకు కట్టుబడి దూకుడు తగ్గిస్తాడన్నది అనుమానమే. ఒకరకంగా మన రవితేజ స్టయిలే తనది.
ఇక మ్యాటర్ లోకి వస్తే అక్షయ్ లేటెస్ట్ మూవీ కట్ పుత్లీ వచ్చే నెల 2న డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా ఓటిటి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభంలో సిండరెల్లా టైటిల్ అనుకుని తర్వాత ఏవో కారణాల వల్ల మార్చేశారు. ఇది తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ అఫీషియల్ రీమేక్. తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడుగా చేసి హిట్టు కొట్టాడు. కొన్ని కీలక మార్పులతో హిందీ వెర్షన్ ని రంజిత్ ఎం తివారి దర్శకత్వంలో పునఃనిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ చేసిన పాత్రను అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ తీసుకుంది.
దీన్ని డిజిటల్ డీల్ లో అక్షరాలా 180 కోట్లకు అమ్మేశారని ముంబై టాక్. ఓటిటి 135 కోట్లు, శాటిలైట్ ప్లస్ మ్యూజిక్ కి మరో 45 కోట్లు మొత్తం గంపగుత్తగా స్టార్ నెట్ వర్క్ తీసుకుందట. గతంలో ఇదే సంస్థ అక్కితో లక్ష్మి బాంబ్, ఆత్రంగీరేలను ఇదే తరహాలో డైరెక్ట్ ఓటిటి విడుదల చేసింది. ఇప్పుడిది మూడోది. ఒకవేళ కట్ పుత్లీ కనక థియేటర్లలో వచ్చి ఉంటే ఇంత మొత్తం రాబట్టడం అసాధ్యం. అసలే రట్ససన్ హిందీ వెర్షన్ ని యుట్యూబ్ లో కోకొల్లలు చూసేశారు. అలాంటప్పుడు ఇంత భారీ లాభాలతో అమ్ముకోవడం కన్నా తెలివైన నిర్ణయం ఇంకేముంటుంది.
This post was last modified on August 25, 2022 10:21 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…