Movie News

RRR – ఒక తీపి ఒక చేదు

థియేట్రికల్ రన్ వంద రోజులు అయిపోయాయి. అయినా ఏదో ఒక రూపంలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అందులో కొన్ని స్వీట్ కొన్ని హాట్ ఉంటున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఏకధాటిగా 14 వారాల పాటు ట్రెండింగ్ లో ఉన్న ఏకైక ఇంగ్లీష్ అండ్ నాన్ ఇంగ్లీష్ మూవీగా ట్రిపులార్ రికార్డు సృష్టించిన విషయం ఆల్రెడీ ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా ఏ చిత్రానికి ఈ ఫీట్ సాధ్యం కాలేదంటే భాషతో సంబంధం లేకుండా రాజమౌళి మాయాజాలం దేశవిదేశాల్లో ఏ స్థాయిలో పని చేసిందో అర్థం చేసుకోవచ్చు

ఇది గుడ్ న్యూస్ అనుకుంటే మరో చేదు వార్త ఉంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ భారీ ఎత్తున శాటిలైట్ ప్రీమియర్ జరుపుకుంది. స్టార్ మా చాలా గ్రాండ్ గా ప్రమోట్ చేసి మరీ ప్రచారం చేసింది. 1100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా కాబట్టి టిఆర్పి రేటింగ్స్ కూడా దానికి తగ్గట్టే వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా 19.62 రేటింగ్ తో సర్దుకుంది. వినడానికి పెద్దగా అనిపిస్తోంది కానీ దీని రేంజ్ కి ఇది తక్కువ. ఎందుకంటే టాప్ వన్ లో అల వైకుంఠపురములో 29.4 తో ఉండగా సరిలేరు నీకెవ్వరు 23.4 తో రెండో స్థానంలో ఉంది.

వీటిని క్రాస్ చేయకపోవడం మాట అటుంచితే కనీసం అయిదో పొజిషన్ లో ఉన్న పుష్ప పార్ట్ 1ని సైతం దాటలేక టాప్ 5లో ఆర్ఆర్ఆర్ చేరలేదు. మూడు నాలుగు ప్లేస్ లో బాహుబలి 2, శ్రీమంతుడు ఉన్నాయి. ఇలా రెండు రోజుల గ్యాప్ లో ఒక తీపి ఒక చేదు అందుకుంది RRR. అయితే ఓటిటిలో యాభై రోజులకే వచ్చేయడం, జనం విపరీతంగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మీద చూసేయడం డౌన్ లోడ్ చేసుకోవడం ఈ రేటింగ్ రావడానికి ఒక కారణమని చెప్పొచ్చు. సరిగ్గా వారం తర్వాత టెలికాస్ట్ అయిన కెజిఎఫ్ 2 ఎంత తెచ్చిందో చూడాలి.

This post was last modified on August 25, 2022 8:32 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

24 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago