హిందీలో బాగా పాపులర్ అయిన టీవీ షోల్లో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ షోను నిర్వహిస్తుంటాడు. ఆరు సీజన్ల పాటు టీవీలో ప్రసారం అయిన ఈ షో.. ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీకి మారింది. కొత్త సీజన్ హాట్ హాట్‌గా నడుస్తూ వ్యూయర్స్‌ను బాగా ఎంగేజ్ చేస్తోంది. ఐతే ఈ షోలో బూతులు మరీ శ్రుతి మించుతున్నాయని, కరణ్ ఎప్పుడూ సెక్స్, అక్రమ సబంధాల చుట్టూ ప్రశ్నలు తిప్పుతూ విసిగిస్తున్నాడని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మీరు ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొంటారా అని తాప్సిని అడిగితే.. ఆ షోకు వెళ్లేంత గొప్పగా నా శృంగార జీవితం లేదంటూ కౌంటర్ వేయడాన్ని బట్టి కరణ్ ప్రోగ్రాం ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాప్సి లాంటి సెలబ్రెటీనే ఇలా అందంటే.. ఇక మామూలు జనాలు షో గురించి ఎలా మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే ఈ వ్యతిరేకత, విమర్శల విషయంలో కరణ్ జోహార్ సరదాగా స్పందించాడు. తన షోను చాలామంది విమర్శించడానికే చూస్తున్నారని, తిట్టే వాళ్ల వల్లే షోకు వ్యూయర్ షిప్ పెరుగుతోందని అతనన్నాడు. ‘‘నా షో గురించి కొందరు చేస్తున్న విమర్శలకు నేను సమాధానం చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో నా షోను తిడుతూ చేసిన ఇన్‌స్టా రీల్స్‌ను చూసి ఆశ్చర్యపోయా. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఇన్నేళ్లుగా షోను నడిపిస్తున్నా.
ఐతే దీని పట్ల ద్వేషం చూపించేవాళ్లు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. వాళ్ల సమయాన్ని నా కోసం కేటాయిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ షోను తిట్టేవాళ్లే దీన్ని ఎక్కువగా చూస్తున్నారు’’ అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ పేర్కొన్నాడు. ‘కాఫీ విత్ కరణ్’ కొత్త సీన్లో టాలీవుడ్ నుంచి సమంత, విజయ్ దేవరకొండ వేర్వేరు ఎపిసోడ్లలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ మెరవబోతున్నారు.
This post was last modified on August 25, 2022 3:45 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…