పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు సినిమాల్లో వాడటం చాలా సార్లు చూసిందే. నితిన్ లాంటి నోటెడ్ స్టార్ తో మొదలుపెట్టి షకలక శంకర్ లాంటి కమెడియన్ దాకా అందరూ పిండేశారు. కాకపోతే వీళ్లంతా ఏ పాటకో సీన్ కో దాన్ని పరిమితం చేశారు కానీ ఏకంగా పవన్ పాత సినిమా బ్రాండింగ్ తో ఓ కథ రాసి రెండు గంటల మూవీ చేయడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. జాతిరత్నాలుతో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కెవి అనుదీప్ స్వయంగా రచన చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ కాన్సెప్ట్ తో విడుదలకు రెడీ అవుతోంది.
ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల వీడియో మొత్తం పవన్ నామస్మరణ ఖుషి తాలూకు మెమోరీస్ తో నింపేశారు. ప్రేమించిన అమ్మాయి ఖుషి మొదటి రోజు మొదటి ఆట టికెట్లు అడిగితే దాన్ని సంపాదించడానికి ఓ కుర్రాడు పడే పాట్లనే సినిమాగా తీసేశారు. వంశీధర్-లక్ష్మినారాయణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఒకప్పుడు కె విశ్వనాథ్ గారితో అద్భుతమైన దృశ్యకావ్యాలని తీసిన పూర్ణోదయా సంస్థ వారసులు ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. లీడ్ పెయిర్ కొత్త మొహాలను తీసుకున్నా మిగిలిన పాత్రలకు భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్లనే పెట్టుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలకే అర్థం లేకుండా ట్రోల్ చేసుకునే హీరోల అభిమానులు ముక్తకంఠంతో ఇప్పుడీ పవన్ బ్రాండ్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది కానీ న్యూట్రల్ ఆడియన్స్ మొదటి నుంచి చివరి దాకా ఒకే పాయింట్ మీద నడిచే కథను ఒప్పుకోవడం మీద దీని సక్సెస్ ఆధారపడి ఉంది. ముందు సెప్టెంబర్ 2 విడుదల అన్నారు కానీ ఇప్పుడీ ట్రైలర్ లో మాత్రం కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. మరి మార్పేదైనా ఉంటుందేమో..
This post was last modified on August 24, 2022 8:36 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…