‘రాధేశ్యామ్’ సినిమా రిలీజై ఐదు నెలలు దాటిపోయింది. కానీ దాని తాలూకు గాయాలు మాత్రం ప్రభాస్ అభిమానులను తొలిచివేస్తూనే ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కూడా డిజాస్టరే అయినప్పటికీ.. ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. పైగా ఆ చిత్రం యాక్షన్ ప్రియులను అంతో ఇంతో మెప్పించింది. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ అయినా ఉన్నాయి. కానీ ‘రాధేశ్యామ్’ ఏ రకంగానూ మెప్పించలేదు.
ఊరికే భారీ లొకేషన్లు, కళ్లు చెదిరే విజువల్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్న హంగామానే తప్ప సినిమాలో విషయం లేకపోయింది. కథాకథనాలు బలహీనంగా ఉండి ఈ హంగులు ఎన్ని జోడిస్తే ఏం లాభం అన్న ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా ఇటీవల ‘సీతారామం’ సినిమా రిలీజైనపుడు ‘రాధేశ్యామ్’ మీద పెద్ద చర్చే జరిగింది. అందులో మనసుకు హత్తుకునే కథాకథనాలు.. అద్భుతమైన ప్రేమ సన్నివేశాలు.. ఆర్టిస్టుల గ్రేట్ పెర్ఫామెన్స్ చూశాక ఇది కదా ఒక ప్రేమకథకు కావాల్సింది అనిపించింది.
తక్కువ బడ్జెట్లో ‘సీతారామం’ను ప్రేమకావ్యంగా మలిచిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ను, ఆ చిత్ర నిర్మాతలను గట్టిగానే వేసుకున్నారు. ‘సీతారామం’తో పోల్చి ‘రాధేశ్యామ్’ గాలి తీశారు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ‘రాధేశ్యామ్’ గురించి నెగెటివ్ చర్చ నడుస్తోంది. ‘బాహుబలి’తో ఉత్తరాదిన తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్.. రెండే రెండు సినిమాలతో వాటిని బాగా దెబ్బ తీసుకున్నాడు.
ముఖ్యంగా ‘రాధేశ్యామ్’ చిత్రం ఉత్తరాదిన కేవలం రూ.18 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అలాంటిది ఇప్పుడు ‘కార్తికేయ-2’ అనే చిన్న సినిమా.. హిందీలో సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రోజు 50 షోలతో మొదలై ఇప్పుడు 3 వేల షోలు దాటిపోయింది. వసూళ్లు ఆల్రెడీ రూ.15 కోట్లు దాటిపోయాయి. త్వరలోనే ‘రాధేశ్యామ్’ను దాటడం ఖాయం. పుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును కూడా అందుకోవడం లాంఛనం లాగే కనిపిస్తోంది. సినిమాలో విషయం ఉండాలే కానీ.. పెద్ద పెద్ద తారలు, భారీ బడ్జెట్లు ఏమీ అవసరం లేదంటూ మరోసారి ‘రాధేశ్యామ్’ను నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
This post was last modified on August 23, 2022 10:38 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…