Movie News

ఆ దర్శకుడు.. ఎప్పుడూ ఇంతే

శక్తి సౌందర్ రాజన్ అని ఒక తమిళ దర్శకుడు. అతడి సినిమాలన్నీ అదో టైపుగా ఉంటాయి. మిగతా ఇండియన్ దర్శకుల్లా అతను ఆలోచించడు. ఎప్పుడూ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల చుట్టూనే అతడి ఆలోచనలు తిరుగుతుంటాయి. ఇలాంటి సినిమాలు మనం ఎందుకు తీయకూడదు అన్నట్లుగా అలాంటి కథలే ప్రయత్నిస్తుంటాడు. ఇండియాలో ఎవ్వరూ ప్రయత్నించని జాంబీ జానర్లో సినిమా తీసి చాలా ఏళ్ల కిందటే అతను అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. జయం రవి హీరోగా నటించిన ఆ చిత్రం అంతా ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత అదే హీరోతో ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమా తీశాడు. ఈసారి అతడి కథ అంతరిక్షం చుట్టూ తిరిగింది. హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’ సినిమా రావడానికంటే ముందే ఇండియాలో తెరకెక్కిన తొలి ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీగా ఇది రికార్డులకెక్కింది. ఆ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. 

ఆ తర్వాత శక్తి సౌందర్ రాజన్ ‘టెడ్డీ’ అనే సినిమా తీశాడు. అది హాట్ స్టార్ ద్వారా రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. మనిషిలా ప్రవర్తించే ఒక టెడ్డీ బేర్ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ మూవీ అది. అందులో ఆర్య హీరో. ఇప్పుడు ఇదే హీరోతో ఇంకో హాలీవుడ్ టచ్ ఉన్న సినిమా చేశాడు శక్తి సౌందర్ రాజన్. అదే.. కెప్టెన్. ఈ చిత్రం బహు భాషల్లో తెరకెక్కింది. ఇది హాలీవుడ్ మూవీ ‘ప్రిడేటర్’ను తలపించే సినిమాలా కనిపిస్తోంది. ఇందులో హీరో ఒక ఆర్మీ కెప్టెన్. సాహసాలు చేసే అతడికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది.

ఒక అడవిలో తిరుగుతున్న వింత జీవి అక్కడికి వెళ్లిన వాళ్లందరినీ మట్టు పెడుతుంటే దాని సంగతి తేల్చాల్సిన అవసరం పడుతుంది. అదొక ఏలియన్ లాగా ఉంటుంది. దాన్ని హీరో అతడి టీం ఎలా ఎదుర్కొంటుందన్నదే ఈ కథ. ఈ సినిమా కథాంశం, విజువల్స్; ఎఫెక్ట్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజినే తలపిస్తున్నాయి. కాకపోతే ఇలాంటివి హాలీవుడ్లో చాలా చూశాం కాబట్టి మన ప్రేక్షకులు ఎంత కొత్తగా ఫీలవుతారన్నది ప్రశ్నార్థకం. సెప్టెంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on August 23, 2022 9:50 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

నోటి ‘దురుసు’ తీరుస్తుందా ?!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…

18 mins ago

అన‌కాప‌ల్లిలో సీఎం ర‌మేష్‌పై వైసీపీ నేత‌ల దాడి.. గాయాలు!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ కార్య‌క‌ర్త ల మ‌ధ్య…

55 mins ago

ప్ర‌తినిధి-2.. ఇదైనా ఖాయం చేసుకోవ‌చ్చా?

నారా రోహిత్ చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన సినిమా ప్ర‌తినిధి-2. ఒక‌ప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఒకే స‌మ‌యంలో…

2 hours ago

ప్రియాంకపై కాంగ్రెస్ లో కుట్ర ?!

రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు…

2 hours ago

పిక్ టాక్: మృణాల్ కాదు శృంగార దేవ‌త‌

హీరోయిన్లు కొంద‌రిని ట్రెడిష‌న‌ల్ లుక్‌లో చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇంకొంద‌రికి సెక్సీ లుక్ బాగుంటుంది. కానీ కొంత‌మంది మాత్ర‌మే ట్రెడిష‌న‌ల్ లుక్‌లో…

2 hours ago

ప్రభాస్ ప్రభావం – కమల్ వెనుకడుగు

ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…

11 hours ago