తమన్ ఇప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మాటకొస్తే ఇండియాలోనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ స్థానానికి అతను గట్టి పోటీదారు అనడంలో సందేహం లేదు. ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో తమన్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఐతే ఎంత పాపులారిటీ, గౌరవం సంపాదించుకున్నప్పటికీ.. తమన్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతూనే ఉంటాడు. తాజాగా గాడ్ ఫాదర్ టీజర్‌తో అతను మరోసారి నెటిజన్లకు లక్ష్యంగా మారేలా కనిపిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా టీజర్ ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే లాంచ్ అయింది. రిచ్ విజువల్స్, ఎలివేషన్లతో ఈ టీజర్ జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. తమన్ నేపథ్య సంగీతం కూడా ఎనర్జిటిగ్గా, అభిమానుల ఉత్సాహాన్ని పెంచేలాగే ఉంది. కాకపోతే ఆ స్కోర్‌లో కొత్తదనం మాత్రం లేదు. కొన్ని నెలల కిందటే విడుదలైన వరుణ్ తేజ్ సినిమా గని టైటిల్ సాంగ్, థీమ్ మ్యూజిక్‌లో వినిపించిన సౌండింగే ఇందులోనూ తమన్ రిపీట్ చేసినట్లు ఉన్నాడు.
టీజర్ ఆద్యంతం రిపీటవుతూ వచ్చిన మ్యూజిక్‌ను పదే పదే గనిని గుర్తుకు చేస్తుండడంతో కొన్ని నిమిషాల్లోనే నెటిజన్లు అలెర్ట్ అయిపోయారు. ఇలా చేశావేంటి తమన్ అంటూ గని టైటిల్ సాంగ్ మ్యూజిక్ బిట్స్‌ను ప్లే చేసి చూపిస్తున్నారు. తమన్‌తో వచ్చిన తలనొప్పి ఇదే.. తన ట్యూన్లను తనే కాపీ కొడుతుంటాడు, అవే రిపీట్ చేస్తుంటాడు అని అతడిని విమర్శిస్తున్నారు. ఇలా తమన్ గతంలో చాలాసార్లు నెటిజన్లకు దొరికిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ మధ్య ఈ రకమైన విమర్శలు కొంచెం తగ్గాయి కానీ.. అప్పుడప్పుడూ మాత్రం ఇలా దొరికిపోతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే గాడ్ ఫాదర్ టీజర్ అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉండి ఆకట్టుకుంటోంది.
This post was last modified on August 22, 2022 4:00 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…