ఇవాళ ఉదయం నుంచి అభిమానులు కౌంట్ డౌన్ పెట్టుకుని మరీ ఎదురు చూసిన గాడ్ ఫాదర్ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం, నయనతార సత్యదేవ్ లాంటి క్యాస్టింగ్, భారీ నిర్మాణ విలువలు మొత్తానికి ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేస్తుందనే భారీ నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. కొద్దిగా లేట్ చేసి ట్విస్టు ఇచ్చారు లెండి.
నిమిషంన్నర ఉన్న టీజర్లో ఒరిజినల్ వెర్షన్ నే ఎక్కువగా ఫాలో అయినట్టు కనిపిస్తోంది. చాలా మార్పులు చేశామని చెప్పారు కానీ విజువల్స్ చూస్తే మాత్రం చేంజెస్ జోలికి పెద్దగా వెళ్లలేదనే చెప్పాలి. అయితే ఈ వీడియోలోనే సల్మాన్ ఖాన్ ని రివీల్ చేయడం ద్వారా డబుల్ ట్రీట్ ఇచ్చారు. కాకపోతే ఆఖరి షాట్ లో జీపులో ఇద్దరు కలిసి గోడ బద్దలు కొట్టుకుని వచ్చే షాట్ లో మాత్రం ఏదో విఎఫ్ఎక్స్ తేడా అనిపించింది. సమయాభావం వల్ల ఏదైనా హడావిడి పడ్డారేమో మరి. మొత్తానికి అంచనాలు రేపేలా కట్ చేయడం విశేషం.
మొదటిసారి హీరోయిన్ లేకుండా చిరంజీవి చేస్తున్న సినిమా కావడం ఈ గాడ్ ఫాదర్ లో మరో ప్రత్యేకత. నయన్ సత్యదేవ్ లు భార్యభర్తలుగా కనిపిస్తారు. ఇతర క్యాస్టింగ్ లో ఒక్క సముతిరఖనిని మాత్రమే రివీల్ చేశారు. నెక్స్ట్ వచ్చే ట్రైలర్ లో ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. విడుదల తేదీని అక్టోబర్ 5 లాక్ చేసి ఆ మేరకు కన్ఫర్మ్ చేసేశారు. అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ దసరా పండక్కు క్లాష్ అయినా పర్లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సో ఇంకో నలభై అయిదు రోజుల్లో గాడ్ ఫాదర్ వచ్చేస్తున్నాడు
This post was last modified on August 21, 2022 8:13 pm
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు.…
హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న…
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు…
టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో…
34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో…
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు…