విజయ్ దేవరకొండ రూటే వేరు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ డైలాగ్ పేల్చినట్లు రానీ చూసుకుందాం అనే టైపు అతను. హిందీ చిత్రాలను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేస్తూ బాయ్‌కాట్ బాయ్‌కాట్ అంటుండడం, ఆ ప్రభావం కొన్ని సినిమాలపై గట్టిగానే పడడంతో బాలీవుడ్ తీవ్ర ఆందోళనలో పడిపోయింది. వీరిని ఎలా నియంత్రించాలో, ఈ ట్రెండ్‌కు ఎలా అడ్డు కట్ట వేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది.
ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌కు నచ్చ చెప్పనూ లేరు. అలాగని వారిని విమర్శించనూ లేరు. ఇంకేం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న టైంలో విజయ్ దేవరకొండ దిగాడు. ఓ ఇంటర్వ్యూలో బాయ్‌కాట్ బ్యాచ్ గురించి తేలిగ్గా తీసిపడేశాడు. వాళ్లకు అటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదన్నాడు. బాయ్‌కాట్ చేస్తే చేయనీ అన్నాడు. ఇలా అన్నాడో లేదో ఆ బ్యాచ్ బాయ్‌కాట్ లైగర్ అంటూ ట్రెండ్ మొదలుపెట్టేసింది. విజయ్‌ని టార్గెట్ చేసింది.
ఇంకొకరైతే భయపడి వెనకడుగు వేసేవారేమో. కానీ విజయ్ ఆ టైపు కాదు. ట్విట్టర్లో ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌కు పంచ్ వేశాడు. మనం కరెక్ట్ ఉన్నపుడు మన ధర్మం మనం చేసినపుడు ఎవరి మాటా వినేది లేదు, కొట్లాడదాం అని ట్వీట్ వేసిన విజయ్.. కొన్ని గంటల తర్వాత విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్లో డైరెక్ట్‌గా బాయ్‌కాట్ బ్యాచ్‌ను తగులుకున్నాడు. మూడేళ్లు కష్టపడి సినిమా తీసి ఎవరికో భయపడాలా, సినిమాలు విడుదల చేయొద్దా అని విజయ్ ప్రశ్నించాడు.
తాను భారతీయుడినని.. చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరికైనా కష్టం వస్తే నిలబడే తరహా అని.. అంతే తప్ప కంప్యూటర్ల వెనుక కూర్చుని ట్వీట్లు వేసే టైపు కాదని విజయ్ అన్నాడు. కరణ్ జోహార్ బాహుబలి సినిమాను ఉత్తరాది జనాలకు చేరువ చేసి ఆ సినిమా ఘనవిజయం సాధించడానికి కారణమైన వ్యక్తి అని.. తమ లైగర్ సినిమాను కూడా అడగ్గానే హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారని.. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడమేంటని విజయ్ ప్రశ్నించాడు. తాను ట్వీట్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మనం మంచి చేస్తున్నపుడు, ధర్మాన్ని పాటిస్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదని విజయ్ స్పష్టం చేశాడు.
This post was last modified on August 21, 2022 7:28 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…