కొవిడ్ టైంలో పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లు నెలల తరబడి మూతబడి ఉండడంతో అలా చేయక తప్పలేదు. మిగతా భాషలతో పోలిస్తే హిందీలోనే ఎక్కువగా పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. వాటిలో అతి పెద్ద సినిమా అంటే అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మి’ అనే చెప్పాలి. ‘కాంఛన’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం హాట్ స్టార్ ద్వారా రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. ఐతే ముందు జరిగిన డీల్ ప్రకారం అక్షయ్ కుమార్ మరో సినిమా ‘ఆత్రంగి రే’ సైతం హాట్ స్టార్‌లోనే నేరుగా రిలీజైంది.
అప్పటికి థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. ఒప్పందం ప్రకారం ఓటీటీలోనే సినిమా రిలీజైంది. అప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు మరింత సాధారణంగా మారాయి. ఇప్పుడు కొవిడ్ గురించి పెద్ద చర్చే లేదు. థియేటర్లపై ఆంక్షలు లేవు. అయినా సరే.. ఇప్పుడు కూడా అక్షయ్ కుమార్ సినిమా ఒకటి డైరెక్టర్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. అదే.. కట్‌పుట్లి.
తమిళంలో సూపర్ హిట్టయి.. ఆ తర్వాత తెలుగులో రీమేక్ అయి ఇక్కడా విజయం సాధించిన ‘రాక్షసన్’కు రీమేకే ‘కట్‌పుట్లి. తమిళంలో విష్ణు విశాల్, తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన పాత్రను అక్షయ్ హిందీలో చేశాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. టేకింగ్ విషయంలో మార్పులు మినహాయిస్తే మాతృకను దించేసినట్లే కనిపిస్తోంది. అక్షయ్‌తో ‘బెల్ బాటం’ చిత్రాన్ని రూపొందించిన రంజిత్ తివారి ఈ సినిమాను రూపొందించాడు. సెప్టెంబరు 2న హాట్ స్టార్‌లో ఈ చిత్రానికి ప్రిమియర్స్ పడబోతున్నాయి.
అక్షయ్ నుంచి రాబోతున్న ఇంకో రెండు సినిమాలు హాట్ స్టార్‌లోనే నేరుగా రిలీజవుతాయని సమాచారం. ఆ ఓటీటీతో అతడికి ఐదు చిత్రాల డీల్ జరిగిందట. మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’, తమిళ మూవీ ‘సూరారై పొట్రు’ రీమేక్‌ల్లో సైతం అక్షయ్ నటిస్తున్నాడు. ఇవి కూడా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా హాట్ స్టార్‌లోనే రిలీజవుతాయని సమాచారం. అక్షయ్ లాంటి పెద్ద హీరో ఒక ఓటీటీలో ఇలాంటి డీల్ చేసుకుని నేరుగా తన సినిమాలను స్ట్రీమింగ్‌కు ఇచ్చేయడం ఆశ్చర్యకరమే.
This post was last modified on August 21, 2022 1:43 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…