ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని, ఆదాయం పడిపోయిందని, ఇలా అయితే సినిమా మనుగడ సాగించడం కష్టమే అని కొన్ని వారాల ముందు టాలీవుడ్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కానీ గత రెండు వారాల్లో థియేటర్లు కళకళలాడిన తీరు చూసి అందరూ అవాక్కవుతున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు పెద్ద హిట్లు సాధించిన టాలీవుడ్ వైపు ఇప్పుడు దేశమంతా చూస్తోంది. ముఖ్యంగా గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ-2’ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పాలి.
హిందీలో నామమాత్రంగా 50 షోలతో మొదలైన ఈ చిత్రం.. ఇప్పుడు 2 వేలకు పైగా షోలతో నడుస్తుండడం విశేషం. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ లాంటి పెద్ద సినిమాలను అది వెనక్కి నెట్టేసింది. హిందీ వెర్షన్ మాత్రమే ఇప్పటిదాకా రూ.8 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తొలి వారం ముగిసేరికి ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ వారం రోజుల షేర్ రూ.26 కోట్ల దాకా వచ్చింది.
‘కార్తికేయ-2’ థియేట్రికల్ హక్కులను రూ.14 కోట్లకు అమ్మారు. తొలి వారంలోనే ఈ చిత్రం దాని మీద దాదాపు రెట్టింపు షేర్ రాబట్టడం విశేషం. అంటే ఆల్రెడీ ఈ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్ అయిపోయింది. హిందీలో ఈ చిత్రానికి లాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ‘పుష్ప’ మాదిరే కొన్ని వారాల పాటు థియేటర్లలో నిలిచేలా ఉంది. అక్కడ మాత్రమే రూ.20-25 కోట్ల మధ్య నెట్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి వారం రూ.18 కోట్ల షేర్, రూ.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం షేర్ రూ.6.5 కోట్లు కాగా.. సీడెడ్లో రూ.2.75 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.8.65 కోట్ల షేర్ కలెక్ట్ అయింది. యుఎస్‌లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసింది. వరల్డ్ వైడ్ సినిమా రిలీజైన ప్రతి చోటా బయ్యర్లు లాభాల బాటలో ఉన్నారు. ఫుల్ రన్లో పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయమే అందుకోవడం ఖాయం. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అంచనా వేయొచ్చు.
This post was last modified on August 21, 2022 12:28 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…