కొత్త సినిమా.. మీమ్ పోస్టర్.. ఫన్నీగుందే

ఎస్ఆర్ కళ్యాణ మండపం.. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ఓ చిన్న సినిమా. ‘ట్యాక్సీవాలా’తో మెరిసిన ప్రియాంక జవాల్కర్.. ‘రాజా వారు రాణి వారు’తో ప్రతిభ చాటుకున్న కిరణ్ అబ్బవరం జంటగా నటించారీ సినిమాలో. మీమ్ పోస్టర్ పేరుతో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ ఫస్ట్ లుక్‌ను సోమవారమే రిలీజ్ చేశారు. హీరోయిన్ లైబ్రరీలోని రాక్స్‌లో పుస్తకాల్ని పరిశీలిస్తూ.. ‘ఈ బుక్ ఏదో ఇంటరెస్టి‌ంగ్‌గా ఉందే.. ఎలాగైనా ఈ రోజు చదవాలి’’ అనుకుంటుంటే.. హీరో మాత్రం ‘‘అబ్బా ఈ నడువేమో షానా ఇంటరెస్టింగ్‌గా ఉందే.. ఎట్టయినా ఈ రోజు తాకాలి’’ అనుకుంటూ ఆబగా చూస్తున్నట్లు ఈ మీమ్ పోస్టర్ రెడీ చేశారు. కొంచెం ఫన్నీగా.. జనాల దృష్టిని ఆకర్షించేలాగే ఈ మీమ్ పోస్టర్ తీర్చిదిద్దారు. కళ్యాణ్, సింధు పాత్రల్లో హీరో హీరోయిన్లు కనిపించనున్నారీ సినిమాలో.

శ్రీధర్ గాదె అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ‘ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద ప్రమోద్, రాజు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ను నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ రోజుల్లో చిన్న సినిమాల మీద జనాల దృష్టి పడాలంటే.. వాళ్లు థియేటర్ల వరకు రావాలంటే కొత్తగా.. సంచలనాత్మకంగా ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ లుక్, టీజర్లలో రొటీన్‌కు భిన్నంగా ఏదో ఒకటి కనిపించాలి. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ టీం ఈ మీమ్ పోస్టర్ ద్వారా ఆ ప్రయత్నంలో కొంతమేర విజయం సాధించినట్లే. టీజర్ కూడా ఇలాగే కొంచెం క్రియేటివ్‌గా ట్రై చేస్తే జనాలు మరింత ఆసక్తి చూపించొచ్చు. ఐతే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం కనిపించని నేపథ్యంలో మళ్లీ సినిమాల ప్రదర్శన మొదలయ్యే వరకు జనాల్ని చిన్న సినిమాలు ఎంగేజ్ చేస్తూ ఆసక్తిని నిలబెట్టడం అంటే సవాలే.

This post was last modified on April 22, 2020 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కింగ్ డమ్ ఫిక్స్ – తమ్ముడు తప్పుకున్నట్టేనా

మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…

24 minutes ago

జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి జకియా ఖానమ్ రాజీనామా

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…

2 hours ago

గోవిందుడి పాట వివాదంతో ఉచిత పబ్లిసిటీ

ఒక్కోసారి వివాదాలే సినిమాలకు పబ్లిసిటీ తెచ్చి పెడతాయి. తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్…

2 hours ago

గుమ్మనూరు టైమేమీ బాగోలేదబ్బా!

గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన…

5 hours ago

జ‌గ‌న్ ఆఫ‌ర్ కు 10 రోజులు.. ప‌ట్టించుకున్న‌వారేరీ.. ?

ఏపార్టీలో అయినా.. అధినేత ఒక మెట్టు దిగి వ‌స్తే.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు రెండు మెట్లుదిగి వ‌చ్చి అధినే త‌కు అనుకూలంగా…

5 hours ago

అంచనాలు తగ్గించుకున్న సితారే

అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు పైగానే…

7 hours ago