ఇంకో అయిదే రోజుల్లో లైగర్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. హిందీ వెర్షన్ ఒక రోజు ఆలస్యమవ్వొచ్చనే వార్తలు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి కానీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఖంగారు పడాల్సిన పని లేదు. యుఎస్ లో డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఇష్యూ నడుస్తోంది కానీ అది కూడా ఏదో విధంగా పరిష్కారమవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా టాలీవుడ్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ మేకర్స్ కన్ను లైగర్ ఫలితం మీద, విజయ్ దేవరకొండ మీద బలంగా పడుతోంది. గత నెల రోజులకు పైగా రౌడీ బాయ్ చేసిన ప్రమోషన్లు మాములుగా లేవు. విపరీతంగా తిరిగేశాడు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడో లెక్క చెప్పడం కష్టం. ఏకంగా రెండు వందల కోట్లతో ఈ సినిమా ఓపెనింగ్ ఉంటుందని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. కరణ్ జోహార్ ని ఆకాశానికెత్తాడు.
బాయ్ కాట్ విషయంలో అమీర్ ఖాన్ కు జరిగిన డ్యామేజ్ పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతు ఇచ్చాడు. ఇక అభిమానుల గురించి, జర్నలిస్టులు తనను ప్రశ్నలు అడిగేందుకు పడుతున్న సంకోచం పట్ల ఓపెనైన తీరు ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సో అందరి చూపు లైగర్ మీద ఉండటం సహజం. అసలే నార్త్ మేకర్స్ మన డామినేషన్ పట్ల కిందా మీద పడుతున్నారు.
ఆఖరికి ఉత్తరాదిలో గుర్తింపే లేని నిఖిల్ సైతం అమీర్ అక్షయ్ లను పక్కకు నెట్టేసే స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించడం పట్ల కుతకుతలాడి పోతున్నారు. ఇప్పుడు లైగర్ కూడా హిట్టు కొడితే వాళ్లకు కునుకు పట్టడం కూడా కష్టమే. అయిదు షోలు, టికెట్ రేట్ల పెంపు, వేలాది స్క్రీన్ లలో రిలీజ్ ఇలా అన్ని అవకాశాలను ఫుల్ గా వాడేసుకుంటున్న లైగర్ కు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే పైన జరిగిన వాటికి సార్థకత చేకూరుతుంది. అదెంతో దూరంలో లేదు జస్ట్ ఓ 96 గంటల్లో తేలిపోనుంది.
This post was last modified on August 21, 2022 4:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…