ఇండియాలో ఇప్పుడు నిఖార్సయిన పాన్ ఇండియన్ సూపర్ స్టార్లలో ప్రభాస్ ఒకడు. బాహుబలితో అతను సంపాదించిన ఇమేజ్, తెచ్చుకున్న పాపులారిటీ, విస్తరించిన మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహో అనే డిజాస్టర్ మూవీ కూడా ఉత్తరాదిన హిందీలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టడం ప్రభాస్ సత్తాను తెలియజెప్పేదే.
ఈ నేపథ్యంలో అతడి నార్త్ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం రాధే శ్యామ్ (వర్కింగ్ టైటిల్)తో పాటు దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడం పక్కా. ఐతే ఇంతటితో ఆగకుండా ప్రభాస్‌తో పూర్తి స్థాయి హిందీ సినిమా చేయించే దిశగా కీలక అడుగు పడింది.
ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన అజయ్ దేవగణ్ మూవీ తానాజీని రూపొందించిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ప్రభాస్ హోం బేనర్ అనదగ్గ యువి క్రియేషన్స్ నిర్మించబోతోందట. వరుసగా యువి వాళ్లకు రెండు సినిమాలు చేశాక.. బ్రేక్ తీసుకుని వైజయంతీ మూవీస్ బేనర్లో నాగ్ అశ్విన్ సినిమా చేయనున్న ప్రభాస్ తిరిగి.. యువితో చేతులు కలపబోతున్నాడు.
ఐతే ఆ చిత్రంలో యువి వాళ్లది నామమాత్రపు భాగస్వామ్యమే అంటున్నారు. ఈ చిత్రాన్ని ఓ బాలీవుడ్ బడా బేనర్ భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. తానాజీ తరహాలోనే ఓ చారిత్రక కథతో ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తాడని అంటున్నారు.2022లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on July 4, 2020 8:16 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…