గత ఏడాది ‘లైగర్’ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోందంటూ ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఆ సినిమాకు రూ.200 కోట్లు ఆఫర్ చేసిందని, టీం ఓకే చెప్పేసిందని వార్తలొచ్చాయి. ఐతే ఈ సినిమాకు మరీం అంత రేటా అని అందరూ ఆశ్చర్యపోతుంటే హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగాడు. తన సినిమా థియేటర్లలో రిలీజైతే అంతకంటే ఎక్కువే వసూలు చేస్తుందని పేర్కొంటూ ఓటీటీ డీల్ విషయంలో నిజం లేదని తేల్చేశాడు.
అప్పుడు విజయ్ మాటలు అందరికీ అతిగా అనిపించాయి. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ కలెక్షన్ అంటే టూమచ్ అని, విజయ్ తన గురించి, తన సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకుంటున్నాడని, సినిమాకు హైప్ పెంచడానికే ఈ కామెంట్ చేశాడని అన్నారు నెటిజన్లు. ఐతే అప్పుడేదో యధాలాపంగా చేసిన కామెంట్ మీద విజయ్ ఇప్పటికీ నిలబడే ఉన్నాడు. ‘లైగర్’ రూ.200 కోట్లను మించే వసూళ్లు రాబడుతుందని అతను తేల్చేశాడు.
‘లైగర్’ నిర్మాత ఛార్మీనే చేసిన ఇంటర్వ్యూలో అతడికి ఈ సినిమా వసూళ్ల గురించి ప్రశ్న ఎదురైంది. దానికతను బదులిస్తూ.. తన లెక్క అయితే రూ.200 కోట్ల నుంచే మొదలవుతుందని.. దాని మీద ఎంత వసూలు చేస్తుందనే తాను చూస్తానని.. అంతకంటే ముందు వచ్చే వసూళ్లను తాను పట్టించుకోనని విజయ్ వ్యాఖ్యానించాడు. ‘లైగర్’ను పూర్తి చేసి విడుదల చేసే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము వెనుకంజ వేయలేదని విజయ్ తెలిపాడు.
‘‘నాకు సినిమా అవకాశాలు దొరకడం కష్టంగా ఉన్నపుడు ‘నీ ధర్మం నువ్వు చెయ్యి. ప్రకృతి చూసుకుంటుంది’ అని నాతో ఒకరు చెప్పారు. దాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ‘లైగర్’ చేసేటపుడు కూడా నా ధర్మాన్ని నేను పాటించా. నా శక్తికి మించి కష్టపడ్డా. సినిమా కోసం అందరూ అంతే కష్టపడ్డారు. సినిమా స్థాయికి మించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. దీంతో నేను కూడా అంతే ఉత్సాహంగా నటించా. ఈ సినిమాతో ఇండియాను షేక్ చేస్తానని అన్నాను. ఆ స్టేట్మెంట్ తప్పు. ఈ నెల 25న ప్రేక్షకులే ఇండియాను షేక్ చేయాలి. వాళ్లను నచ్చేలా సాలిడ్ సినిమాను దించుతున్నాం’’ అని విజయ్ అన్నాడు.
This post was last modified on August 20, 2022 10:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…