Movie News

దిల్ రాజు చేతికి మరో భారీ సినిమా

ఇండియన్ స్క్రీన్ మీదికి రాబోతున్న మరో భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్రానికి ఆశించినంత హైప్ లేకపోవచ్చు కానీ.. ఇది ‘బాహుబలి’కి దీటుగా నిలిచే చిత్రం అవుతుందని కోలీవుడ్ ఆశిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రాన్ని రూపొందించింది దిగ్గజ దర్శకుడు మణిరత్నం. ఈ సినిమా తీయాలని ఆయన రెండు దశాబ్దాల ముందు నుంచి కలలు కంటున్నారు. తమిళ లెజెండరీ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు.

లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్నిరూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబరు 30న ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. తెలుగులో ఈ చిత్రానికి పెద్ద సపోర్టే దొరికింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ‘PS-1’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నాడు.

‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ చూస్తే ఇది ఉన్నత స్థాయి సినిమాలాగే కనిపించింది కానీ.. తమిళనాడు అవతల ఈ చిత్రానికి హైప్ తీసుకురావడంలో ఆ చిత్ర బృందం ఇప్పటిదాకా ఫెయిలైంది. ఐతే ఇప్పుడు దిల్ రాజు రంగంలోకి దిగాడు కాబట్టి ఆటోమేటిగ్గా తెలుగులో బజ్ పెరగొచ్చు. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటేనే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఏర్పడుతుంది. పబ్లిసిటీ గట్టిగా చేస్తారు. రిలీజ్ ప్లానింగ్ కూడా చాలా బాగుంటుంది.

ఇంతకుముందు మణిరత్నం సినిమాలు ‘ఓకే బంగారం’, ‘చెలియా’లను దిల్ రాజే రిలీజ్ చేయడం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్ ఆరంభంలో ‘అమృత’ చిత్రాన్ని సైతం రాజు తెలుగులో విడుదల చేశాడు. ‘పొన్నియన్ సెల్వన్’కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. విక్రమ్, కార్తి, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, ఐశ్వర్యారాయ్, మోహన్ బాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

This post was last modified on August 20, 2022 6:32 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

25 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

14 hours ago