Categories: Movie News

ఆ పిల్ల మహేష్ పక్కన సెట్ అవ్వుద్దా?

మహేష్ బాబు సినిమాల విషయంలో ఎంత సెలక్టివ్‌గా ఉంటాడో, హీరోయిన్ల విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటాడు. ఎంతంటే 26 సినిమాలు తీసిన మహేష్, తన కెరీర్‌లో కేవలం ఇద్దరు హీరోయిన్లను మాత్రమే రిపీట్ చేశాడు. త్రిషతో రెండోసారి తీసిన‘సైనికుడు’, సమంతతో తీసిన మూడో సినిమా ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్లుగా నిలవడంతో మహేష్‌కు ప్రతీ సినిమాలో హీరోయిన్‌ను మార్చాలనే సెంటిమెంట్ పట్టుకుంది. దీంతో మహేష్ తాజా సినిమాకు హీరోయిన్ కష్టాలు ఎదురవుతున్నాయట.

డైరెక్టర్ పరుశురామ్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ చేసిన మహేష్‌బాబు, ఈ సినిమా ద్వారా ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని టాక్. హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురిగా తెరంగ్రేటం చేసిన సారా ఆలీఖాన్‌ను మహేష్ పక్కన హీరోయిన్‌గా అనుకుంటున్నారట. సారా వయసు 24 ఏళ్లు. అయితే చూడడానికి మాత్రం మరీ చిన్నపిల్లలా టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తుందీ హాట్ బ్యూటీ. దాంతో మహేష్ పక్కన, సారా మరీ చిన్నపిల్లలా కనిపిస్తుందేమోనని డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్.

మహేష్ బాబుకి 44 ఏళ్లైనా చూడడానికి చాలా యంగ్‌గా కనిపిస్తాడు. మనోడు ఎంచుకునే స్క్రిప్ట్స్ విషయంలో ట్రోల్స్ వచ్చాయేమో కానీ లుక్స్ పరంగా మాత్రం మహేష్‌కు తిరుగులేదు. ఎంత యంగ్‌గా కనిపించినా తనకంటే 20 ఏళ్లు చిన్నదైన సారాను హీరోయిన్‌గా పెట్టుకోవడమంటే పెద్ద రిస్క్ చేయడమే. అందులోనూ పరుశురామ్‌తో చేస్తున్న సినిమా ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. అలాంటి కథలో చిన్నపిల్లలా కనిపించే హీరోయిన్‌తో సరసాలు ఆడితే, విపరీతమైన ట్రోల్స్ రావడం గ్యారెంటీ.  తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ చాలామంది స్టార్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అదీగాక ఇప్పటికే నమ్రత, సొనాలీ బింద్రే, లీసా రాయ్, అమృతరావు లాంటి బాలీవుడ్ హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు మహేష్. వీరిలో ఒక్క సొనాలీ బింద్రే  తప్ప, మిగిలిన బాలీవుడ్ హీరోయిన్లు ప్రిన్స్‌కు హిట్టు ఇవ్వలేకపోయారు. మరోసారి సూపర్ స్టార్ హీరోయిన్ కోసం బాలీవుడ్ వైపు చూడడంతో ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్.

This post was last modified on April 22, 2020 1:40 pm

Share

Recent Posts

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

56 minutes ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

4 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

5 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

11 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

11 hours ago