విజయ్ దేవరకొండ బోల్డ్ కామెంట్లకు, స్టేట్మెంట్లకు పెట్టింది పేరు. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తనేం అనాలనుకుంటే అది అనేస్తాడు. ఏం ఏచయాలనుకుంటే అది చేసేస్తాడు. ఈ క్రమంలో అతడి చర్యలు, మాటలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఐతే ఎవరెంత గొడవ చేసినా విజయ్ మాత్రం పట్టనట్లే ఉంటాడు. ఈ అగ్రిసెవ్.. డోంట్ కేర్ యాటిట్యూడ్ అన్నిసార్లు వర్కవుట్ కాదు. కొన్నిసార్లు లేని తలనొప్పులు ఎదురు కావచ్చు. తాజాగా విజయ్ చేసిన ఒక కామెంట్ అతడి కొత్త చిత్రం లైగర్‌కు ఎక్కడ ముప్పు తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది అభిమానుల్లో.
కొంత కాలంగా హిందీ సినిమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. రకరకాల కారణాలు చూపించి బాలీవుడ్ స్టార్ల సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నారు నెటిజన్లు. అదే పనిగా సినిమాల మీద నెగెటివ్ ప్రచారం చేసి వాటిని చంపేస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెగెటివ్ ట్రెండ్ గురించి ఎవరైనా విమర్శలు చేసినా వదలట్లేదు. తాము వ్యతిరేకిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాను హృతిక్ రోషన్ పొగిడాడని అతడి సినిమా విక్రమ్ వేదను టార్గెట్ చేయడం తెలిసిందే.
ఇప్పుడు విజయ్ కూడా వాళ్లకు టార్గెట్ అయిపోతాడేమో అన్న చర్చ నడుస్తోంది. లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గురించి చర్చ వచ్చింది. సినిమాల మీద వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, ఇలా బాయ్‌కాట్ చేయడం సరి కాదని అనన్య పేర్కొంది.
అంతలో విజయ్ జోక్యం చేసుకుని సినిమాలను బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేసే వాళ్లకు అవసరానికి మించి అటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదన్నాడు. అంతే కాక బాయ్‌కాట్ చేస్తే చేయనివ్వండి.. వాళ్లు అలా ట్రెండ్ చేస్తే ఏమవుతుంది? థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు చూస్తారు, లేదంటే ఓటీటీలో చూస్తారు అంతకు మించి ఏమవవ్వదు అని తేల్చేశాడు. ఐతే విజయ్ మాటల్లో తప్పేమీ లేదు కానీ.. సోషల్ మీడియాలో ఎవరు దొరుకుతారా అని కాచుకుని ఉన్న ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌ను రెచ్చగొట్టి తన సినిమాను రిస్క్‌లో పెట్టాడేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 20, 2022 9:41 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…