అసలే ఎన్నడూ చూడని కష్టకాలంలో ఉన్న బాలీవుడ్ కు ఇప్పట్లో ఓదార్పు దక్కేలా లేదు. సౌత్ సినిమా డామినేషన్ పెరిగిపోయి అసలు హిందీ చిత్రాలంటేనే వద్దు బాబోయ్ అనేలా అక్కడి ప్రేక్షకులు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఒక ఏడెనిమిది నెలల కాలం తీసుకుంటే నార్త్ బెల్ట్ లో బాగా ఆడి టాప్ గ్రాసర్స్ గా నిలిచిన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1, కార్తికేయ 2 ఇవన్నీ దక్షణాది నుంచి వెళ్లి అద్భుతాలు చేసినవే.
అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో పోలిస్తే అంతగా గుర్తింపే లేని నిఖిల్ మూవీ ఎక్కువ వసూలు చేస్తోందంటే దానికన్నా నిదర్శనం వేరే కావాలా. సరే ఎప్పటికైనా ఇది సద్దుమణగకపోదా స్ట్రెయిట్ సినిమా ఏదైనా ఆడకపోదా అని ఎదురు చూస్తున్న టైంలో ఇవాళ తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన దొబారా దేశవ్యాప్తంగా విడుదలయ్యింది.
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన అనురాగ్ కశ్యప్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇది స్పానిష్ మూవీ మిరేజ్ రీమేక్ అని ముందే చెప్పడం వల్ల అనుమానాలు భయాలు లేకపోలేదు. వాటిని నిజం చేస్తూ దొబారా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. క్రిటిక్స్ సైతం కన్ఫ్యూజింగ్ నెరేషన్ కి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చి గట్టిగా క్లాసులు తీసుకున్నారు.
పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఉదయం ఇంకా మొదట ఆట పడకుండానే సుమారు 200 షోల దాకా జనం లేనందుకు క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొబారా ప్రమోషన్ టైంలో తాప్సీ అనురాగ్ లు బాయ్ కాట్ లను ఉద్దేశించి చేసిన వెటకారం కామెంట్లను నెటిజెన్లు సీరియస్ గా తీసుకోవడం కొంత ప్రభావం చూపించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో మర్డర్ మిస్టరీని చూపించాలని చేసిన ప్రయత్నం మొత్తంగా బెడిసి కొట్టింది. సో లైగర్ వచ్చేదాకా కార్తికేయ 2దే ఉత్తరాది రాష్ట్రాల్లో టాప్ చైర్ కానుంది.
This post was last modified on August 20, 2022 2:25 am
ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా…
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…