మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి మిత్రులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగా ఒకరికొకరు ఎప్పుడూ సహకరించుకుంటూ ఉంటారు. వాళ్లిద్దరి మధ్య వ్యక్తిగత, వ్యాపార బంధాలు ఉన్నాయి. ఐతే వీళ్లిప్పుడు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చిరు-నాగ్ సినిమాలు ఒకదాంతో ఒకటి పోటీ పడ్డ సందర్బాలు లేకపోలేదు. కానీ గత రెండు దశాబ్దాల్లో అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ దసరాకు చిరు, నాగ్‌ల మధ్య బాక్సాఫీస్ పోటీ అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది.
నాగార్జున కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ఆల్రెడీ అక్టోబరు 5కు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల ముందే డేట్ ఖరారు చేశారు. తాజాగా మరోసారి విడుదల తేదీని రూఢి చేస్తూ చిన్న టీజర్ ఒకటి వదిలారు. విడుదలకు 40 రోజుల ముందే థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేసి గట్టిగా ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. అక్టోబరు 5 విషయంలో నాగ్ అసలు తగ్గేలా లేడు.
ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’ను ముందు ఆగస్టులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యమైంది. వచ్చే సంక్రాంతికి బాబీతో చేస్తున్న చిరు సినిమా విడుదల కావాల్సి ఉంది. కాబట్టి ముందు వచ్చే సినిమాతో గ్యాప్ ఉండాల్సిందే. అందుకే దసరాకు ‘గాడ్ ఫాదర్’ను విడుదల చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. చిరు పుట్టిన రోజున టీజర్ కూడా వదిలేస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. వచ్చే నెల మధ్య కల్లా సినిమా రెడీ అయిపోతుందని అంటున్నారు.
కాబట్టి దసరా సెలవుల్లో రిలీజ్ చేసే మంచి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. బాలయ్య కొత్త చిత్రం కూడా దసరాకు వస్తుందని కొన్ని నెలల కిందట ప్రచారం జరిగింది కానీ.. ఆ చిత్రం వాయిదా పడిపోయింది. ఇంకే పెద్ద సినిమాలు కూడా దసరా రేసులోకి వచ్చే సూచనలు లేవు. ఒకట్రెండు చిన్న సినిమాలేవైనా బరిలో ఉంటే ఉండొచ్చు. ప్రధానంగా దసరా పోటీ చిరు, నాగ్‌ల మధ్యే ఉంటుందన్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈ ఇద్దరు మిత్రులు ఒకేసారి హిట్ కొట్టి బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తారేమో చూడాలి.
This post was last modified on August 20, 2022 12:19 am
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…